మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ ఎంతో కష్టపడింది. అంతకుమించి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అందులో ఒకటి ముందుగానే అక్కడ కొంతమేర బలం ఉన్న వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం. అక్కడ వామపక్షాలతో కలిసి ముందుకు సాగడం ద్వారా తమకు కలిసి వస్తుందని కేసీఆర్(KCR) వేసుకున్న అంచనాలు నిజమని ఫలితాలు వెల్లడించాయి. మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక తరువాత వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో(TRS) వామపక్షాల పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణకు చెందిన వామపక్షాల కీలక నేతలు తమ్మినేని వీరభద్రం వంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. అయితే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల సాయం తీసుకోవాలా ? లేక వారి సాయాన్ని మునుగోడు ఉప ఎన్నికకు మాత్రమే పరిమితం చేయాలా ? అన్న విషయంలో మాత్రం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ వామపక్షాలతో పొత్తు అంశాన్ని ప్రస్తావించకపోవడంతో.. ఆయన ఈ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీపీఐ కీలక నేతల్లో ఒకరైన చాడ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకై టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని, టిఆర్ఎస్ కు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన అన్నారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల తర్వాత టిఆర్ఎస్తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని, టిఆర్ఎస్ వామపక్షాలను అర్థం చేసుకోని సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధం కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలో సిపిఐ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని చాడ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
MLC Kavitha: ఇక్కడ దొరికినోళ్లను విచారణ చేయొద్ద..నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు..ఎమ్మెల్సీ కవిత ఫైర్
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వామపక్షాల నేతలతో కలిసి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు కూడా జరుపుతూ వచ్చారు. కానీ ఆ తరువాత వారితో కేసీఆర్ ఇతర అంశాల గురించి మాట్లాడలేదా ? వారిని పట్టించుకోవడం లేదా ? అనేది తెలియాల్సి ఉంది. అయితే చాడ వెంకట్ రెడ్డి చెప్పిన కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది కేసీఆర్తోనేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.