TS POLITICS TELANGANA CONGRESS YSRTP WOMEN LEADERS CRITICIZED THE TRS PARTY AS A TELANGANA RAPE SUPPORT PARTY SNR
Telangana: TRS పేరు మార్చిన వైఎస్ఆర్టీపీ, తెలంగాణ కాంగ్రెస్.. మార్చిన పేరు ఏమిటంటే
(TRSఅంటే అర్ధం అదా)
TELANGANA: టీఆర్ఎస్ పార్టీ పేరునే మార్చేస్తాయి విపక్ష పార్టీలు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచార ఘటనలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చేశారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్(Brand image) పెంచుతున్నామని టీఆర్ఎస్(trs) నేతలు చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్ర ఇమేజ్‌ని డ్యామేజ్Damage చేస్తున్నారని మండిపడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన మొదల్కొని నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం అరికట్టకపోగా..నేరస్తుల్ని కాపాడుతోంది, అత్యాచారాలను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి(trs) పేరుకి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అటు కాంగ్రెస్(Telangana Congress) ..ఇటు వైఎస్ఆర్టీపీ (YSRTP)రెండూ పార్టీల మహిళా నాయకులు టీఆర్ఎస్తో పాటు ఆ పార్టీ నాయకులను ఈనేరాలను ఆపాదించే విధంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేశారు..
జూబ్లిహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. ఈవిషయంలో గత రెండ్రోజుల వరకు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే ఛాన్సును కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ తీసుకుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఆర్ఎస్ పార్టీ పేరునే మార్చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే ఇన్ని అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇది ఆ పార్టీ నేతల పనే అన్నట్లుగా విమర్శించారు. అంతే కాదు తోగుబోతులు, రేపిష్టుల పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు షర్మిల.
తాగుబోతు రేపిస్టుల పార్టీ :షర్మిల
ఖమ్మం జిల్లా వైరా మండలంలో బుధవారం 88వ రోజు పాదయాత్ర కొనసాగించారు షర్మిల. గరికపాడులో స్థానికులతో ‘మాట ముచ్చట’కార్యక్రమం నిర్వహించారు. అక్కడే ఈ ఘాటు విమర్శలు చేశారు.అలాగే పనుల కోసం కూలీకి వెళ్తున్న మహిళలను మాన, ప్రాణాలు అడుగుతున్నారని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీ పార్టీలోకి వస్తారా అని అడిగిన ప్రశ్నలకు ఆయన మంచి నాయకుడని వస్తే ఆహ్వానిస్తామని షర్మిల బదులిచ్చారు.
తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ: కాంగ్రెస్
వైఎస్ఆర్టీపీనే కాదు..తెలంగాణ కాంగ్రెస్ మహిళ నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చేశారు. రేప్ కేసును ఖండిస్తూ దోషుల్ని శిక్షించాలని కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు డిసౌజాతో పాటు రాష్ట్ర మహిళా నాయకులు గాందీభవన్‌లో మౌనదీక్ష చేపట్టారు. నేరాల్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న నాయకులు..దోషులకు కొమ్ముకాస్తూ నేరాలను పెంచి, పోషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ కాదని..తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ మహిళా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అటుపై డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
మౌనం వీడాల్సిందే..
నిన్నటి వరకు బీజేపీ నేతలు ఇదే విషయంపై టీఆర్ఎస్ని దుమ్మెత్తిపోశారు. వాళ్లు కాస్త గ్యాప్ ఇస్తే కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంతటి వ్యాఖ్యలు చేస్తున్నా గులాబీ శ్రేణులు ఎందుకు నోరు మెదపడడం లేదనే చర్చ జరుగుతోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.