Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS TOOK KEY DECISIONS IN PARTY INTERNAL MEETING WITH DCC PRESIDENTS AK

T Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు.. వారికి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

Telangana Congress: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన రాహుల్ గాంధీ... తెలంగాణలో వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేలా చూద్దామని పార్టీ నేతల సమావేశంలో రేవంత్‌రెడ్డి అన్నారు.

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం హాట్ హాట్‌గా సాగింది. వరంగల్‌లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఆహ్వానించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా పార్టీ ఆస్తులపై వచ్చే ఆదాయం, డీసీసీల నిర్వహణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. వచ్చే సమావేశం నాటికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ భవనాలపై వస్తున్న ఆదాయం, ఖర్చులతో నివేదికలతో రావాలని స్పష్టం చేశారు. అయితే విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ సభావేదికపై డీసీసీలను పిలవకపోవడంపై అలక వహించారు. మరోవైపు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ఉదయ్‌పూర్‌ చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) నేతలు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌ డీక్లరేషన్‌ను జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఉదయ్‌పూర్‌ చింతన్ శివిర్‌లో వరంగల్ రైతు సంఘర్షణ సభపై చర్చ జరిగిందన్నారు. ఉదయ్‌పూర్‌లో తీసుకున్న ప్రతి అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని..దీనిని సోనియా గాంధీకి పంపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చ బండ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

    మే 21న ముఖ్య నేతలంతా ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని తెలిపారు. జూన్ 21 వరకు రైతు రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇక తాను వరంగల్ జిల్లా జయశంకర్‌ (JayaShankar) సొంత గ్రామంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా అన్ని గ్రామాల్లో విజయవంతం చేసేలా కృషి చేయాలని తెలిపారు.

    TS Inter Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

    KCR| BJP: కేసీఆర్ ఆ విషయంలో ఫిక్స్ అయ్యారా ?.. బీజేపీ కూడా అలాగే ఆలోచిస్తోందా ?

    మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన రాహుల్ గాంధీ... తెలంగాణలో వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేలా చూద్దామని పార్టీ నేతల సమావేశంలో రేవంత్‌రెడ్డి అన్నారు. అక్టోబర్ 2న రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట తెలంగాణలోనే జరిగేలా తీర్మానం చేశామని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు