Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS TO START PALLE PALLE KU CONGRESS PROGRAM TAKING RAHUL GANDHI WARANGAL DECLARATION AHEAD AK

Telangana: పల్లెకు పోదాం అంటున్న తెలంగాణ కాంగ్రెస్.. త్వరలోనే కొత్త కార్యాచరణ.. 16న కీలక నిర్ణయం

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

T Congress: తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. వరంగల్ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు.

    తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ద్వారా ప్రజలు, పార్టీ శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగంలోకి ఎక్కువగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం త్వరలోనే పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే కార్యాచరణ చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టు సమాచారం.

    పార్టీలోని ఓ 300 నేతలను ఎంపిక చేసి.. వారికి ఒక్కొక్కరికి 30 గ్రామాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించిన వరంగల్ (Warangal) రైతు డిక్లరేషన్ అంశాలను వివరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో రైతు డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్న పట్టును మరోసారి పొందవచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

    పార్టీ ముఖ్యనేతలంతా జిల్లా స్థాయిలో ఈ రైతు డిక్లరేషన్‌పై సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. గ్రామాల్లో దీనిపై సభలు, సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ (Congress) యోచిస్తోంది. అయితే ఏ నేతలకు ఏ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల్లో ప్రచారం చేసే బాధ్యతలు ఇవ్వాలనే దానిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ విషయంలో ఆయా జిల్లాల నేతలతో చర్చించిన తరువాతే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    Hyderabad: ప్రియుడిని చంపిన మహిళ.. హత్య చేసిన యాక్సిడెంట్‌గా చిత్రీకరించే కుట్ర.. చివరకు..

    Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారా ?.. ఆ కీలక నేత బుజ్జగిస్తున్నారా ?

    ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. వరంగల్ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ, రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు బీమా వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ... తెలంగాణ ప్రజలకు, రైతులకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు