నిన్న తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ కు కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక జూమ్ మీటింగ్ కు హాజరు కానీ 11 మంది ప్రజా ప్రతినిధులపై టీపీసీసీ ఫైర్ అయింది. మీటింగ్ గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిన్న నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar Reddy) మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ మీటింగ్ లో టీ కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రేపటి నుంచి డిసెంబర్ (Decembar) 5 వరకు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన తేదీలను ఖరారు చేశారు.
రైతుల కోసం కాంగ్రెస్ పోరాటం..కార్యాచరణ ఇదే..
కాగా రైతుల కోసం పోరాటం చేయడానికి కార్యాచరణను జూమ్ మీటింగ్ లో ప్రకటించారు. దీని ప్రకారం ఈనెల 24న అన్ని మండల కేంద్రాల్లో, 30న అన్ని నియోజవర్గాల్లో, డిసెంబర్ 5న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కార్యాచరణ ఇదీ..
తెలంగాణలో రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది
రైతు రుణ మాఫీతో పాటు ధరణి సమస్యల పరిష్కారం, ఏపీలో జరుగుతున్న తరహా కార్యక్రమాల అమలు కోసం 21న సీఎస్‌ను కలవాలని తీర్మానించారు. pic.twitter.com/Ovpu59hnSk
— Telangana Congress (@INCTelangana) November 20, 2022
కాగా నిన్న ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)పై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి (marri Shasidhar Reddy) పార్టీ వీడితే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి (Revant Reddy), భట్టి విక్రమార్కే (Bhatti Vikramarka) వహించాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జావేద్ ఆరా తీశారు. ఇదిలా ఉంటే నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దీనిపై జగ్గారెడ్డి (Jaggareddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని, కంపెనీ కాదని అసహనం వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటి. ఇది కరెక్ట్ కాదని జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలని కానీ ఇలా జూమ్ మీటింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. కాగా జగ్గారెడ్డి (Jaggareddy) ఈ జూమ్ మీటింగ్ కు హాజరు కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Hyderabad, Jaggareddy, Revanth Reddy, Telangana, Tpcc, TS Congress