తెలంగాణ కాంగ్రెస్‌లో మరిన్ని పాదయాత్రలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్న నేతలు, ఆయనతో విభేదించే నేతలు కొందరు.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం భావిస్తున్నారు. అందుకే ఈ పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు ఏఐసీసీ ప్రోగ్రామ్స్ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheshwar Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ పోరుయా త్ర పేరిట మరో పాదయాత్రను మొదలుపెట్టారు. ఇది కొనసాగుతోంది. ఆయనకు తోడుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సీనియర్ల ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని సీనియర్లు కీలక నేతలు కూడా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇప్పటికే దీనిపై అంతర్గతంగా ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్కతో(Bhatti Vikramarka) పాటు మరికొందరు సీనియర్లు యాత్రలు ప్రారంభించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ జిల్లాలో ఆయన మరికొంత మంది సీనియర్లను కలుపుకొని పాదయాత్ర చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గం వాదిస్తోంది. నల్లగొండలో మొదలుపెట్టి రంగారెడ్డిని టచ్ చేస్తూ.. హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలనేది పార్టీలో సీనియర్ల నిర్ణయంగా కనిపిసతోంది.
ఉమ్మడి ఖమ్మంలో భట్టి విక్రమార్క నేతృత్వంలో పాదయాత్రను మొదలుపెట్టి.. ఆ జిల్లాలోని ఇతర నేతలను భాగస్వామ్యం చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సీనియర్ నేతలు కూడా ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అన్ని జిల్లాల్లో సీనియర్లు అధ్వర్యంలో పాదయాత్రలు జరగాలని కేడర్ ఒత్తిడి తెస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana: ప్రగతిభవన్ కాదు..ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణలో టీడీపీలో కొత్త ఆశలు.. ఆ జిల్లా నేతల్లో నూతనోత్సాహం
ఇప్పటికే కొందరు సీనియర్లు పాదయాత్రపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్లంతా తలోదారి పడుతుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి తీరు కారణంగానే ఇలా జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతుంటే.. రేవంత్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన స్పందనను తగ్గించేందుకు కొందరు నేతలు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy