తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఎవరికీ క్లారిటీ రావడం లేదు. గతంలో రెండుసార్లు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాబట్టి ఆయన సీటు కొడంగల్(Kodangal) అని.. అక్కడి నుంచే ఆయన పోటీ చేస్తారని చాలామంది భావించారు. కానీ ఆయన గ్రేటర్ పరిధిలోని ఉప్పల్(Uppal) లేదా ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన మల్కాజ్ గిరి సీటు పరిధిలోని ఉప్పల్ లేదా ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో కాంగ్రెస్ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇటీవల ఆయన కొడంగల్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆయన మళ్లీ కొడంగల్ నుంచే పోటీ చేస్తారనే వార్తలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాము వచ్చే ఎన్నికల్లో తాము గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూర్ నగర్, నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎందుకనో స్పష్టత ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి వంటి నాయకుడు కావాలంటే ఇప్పటికే తాను పోటీ చేయబోయే సీటు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకు అధిష్టానం కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదు.
YS Sharmila: రేపు రాజ్‌భవన్‌కువైఎస్ షర్మిల.. కేసీఆర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు..!
Hyderabad: గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే మటన్.. ప్రభుత్వ మాంసం దుకాణాల ఏర్పాటు
కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే ఆలోచనలో లేనట్టు కనిపిస్తోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఉప్పల్ లేదా ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తే.. కొడంగల్ నుంచి ఆయన సోదరుడిని బరిలోకి దింపాలనే ప్లాన్‌తో ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. కానీ ఇందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకుంటుందా ? సొంత పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana