Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS PARTY IN CHARGE MANICKAM TAGORE TWEETED THAT THE ALLIANCE WITH TRS AND BJP IS NOT MENTIONED SNR

Manickam Tagore:తెలంగాణలో పొత్తులు,గిత్తులు లేవ్..టీఆర్‌ఎస్‌, బీజేపీపై పోరాడటంలో తగ్గేదేలే

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Telangana Congress: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీతో పొత్తు పెట్టుకోదని చెప్పారు ఆపార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్. పొత్తులపై వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాంగ్రెస్‌ బలం ఏమిటో వచ్చే నెల 6వ తేదిన వరంగల్ బహిరంగసభతో నిరూపిస్తామని ట్వీట్‌ చేశారు మాణిక్కం ఠాగూర్.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో ఒకప్పుడు హస్తవాసి బాగుందనుకున్న హస్తం గుర్తు పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి రాలేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ(Congress party)ని అందరూ చిన్నచూపు చూస్తున్నారని పార్టీ హైకమాండ్‌కి అర్ధమైనట్లుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) ,బీజేపీ(BJP)తో పొత్తుపెట్టుకుంటుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా(Social media)లో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore). తెలంగాణ కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలో నిజం లేదని..అంతా తప్పుడు ప్రచారమని సోషల్ మీడియా ద్వారా ఖండించారు. అంతే కాదు బీజేపీ, టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటంలో ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేదేలేదని ట్విట్టర్ (Twitter) ద్వారా స్పష్టం చేశారు మాణిక్కం ఠాగూర్. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం వాళ్లే చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుందంటూ పరోక్షంగా టీఆర్‌ఎస్‌, బీజేపీని విమర్శించారు.

పొత్తులు, గిత్తులు లేవ్..
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో భిన్నవాదనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చినట్లైంది. దానికి తోడు మే నెల 6వ తేదిన వరంగల్‌ నిర్వహిస్తున్న బహిరంగ సభలో కాంగ్రెస్ బలం ఏమిటో నిరూపిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్ స్పష్టం చేశారు. అంటే మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ పరమార్ధం ఎవరితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదనే సమాధానంతో పాటు పార్టీలోకి వలసలు ఉంటాయని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.  అయితే కాంగ్రెస్‌ నేతల్లో కుమ్మలాటలు కాస్త తగ్గినట్లు పైకి కనిపిస్తున్నప్పటికి అంతర్గతంగా మాత్రం  అదే ఆధిపత్యపోరు కొనసాగిస్తున్నారు కొందరు నేతలు.
https://www.dishadaily.com/telugunews/congress-alliance-with-trs-clarity-given-by-congress-in-charge-manickam-tagore-123877

పోరాడే విషయంలో తగ్గేదేలే..
రాహుల్‌గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో నెలకొన్న విభేదాలు పటాపంచలు అయ్యాయని హైకమాండ్‌ భావిస్తోంది. దీనికి తోడుగా పార్టీలో సీనియర్‌నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో పార్టీలో సీనియర్‌లుగా ఉన్న కొందరు అసంతృప్తులకు ఎన్నికల సమయానికి ప్రత్యేక పదవులు, గుర్తింపు ఇస్తుందనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసింది ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పుడు పొత్తులు, గిత్తులు లేవని మాణిక్కం ఠాగూర్ మరింత స్పష్టంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో పాటు ఇతర పార్టీల్లో నెలకొన్న తప్పుడు అభిప్రాయాన్ని చెరిపేశారు. ఈ స్టేట్‌మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుందో..లేక హస్తిన పెద్దల మనసు మారితే మళ్లీ కొత్త స్టేట్‌మెంట్ వస్తుందేమో చూడాలని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Congress ts, Telangana News, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు