హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: ఆ ఇద్దరిని మార్చండి.. లేకపోతే కాంగ్రెస్ బతకదు.. ఎంపీ కోమటిరెడ్డి కొత్త డిమాండ్

Telangana Congress: ఆ ఇద్దరిని మార్చండి.. లేకపోతే కాంగ్రెస్ బతకదు.. ఎంపీ కోమటిరెడ్డి కొత్త డిమాండ్

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Komatireddy Venkat Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలతో సమావేశం కాగా.. ఈ భేటీకి డుమ్మా కొట్టి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఓ వైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలతో సమావేశం కాగా.. ఈ భేటీకి డుమ్మా కొట్టి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. హైకమాండ్‌తో జరిగిన భేటీకి ఎందుకు హాజరుకాలేదనే అంశంపై సోనియాగాంధీకి లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌కు(Manickam Tagore) అనుభవం లేదని.. ఆయన స్థానంలో కమల్‌నాథ్(Kamalnath) వంటి సీనియర్ నేతను ఇంఛార్జ్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకుని టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని(Revanth Reddy) మార్చి.. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని అధిష్టానానికి సూచించారు. అలా చేయని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ బతికే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

  కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఇక్కడ పార్టీ కచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు సూచించేందుకు ఈ కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ భేటీలోనే మునుగోడులో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించడం అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యతను కుదిర్చే ప్రయత్నం కూడా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది.

  అందుకే ఈ భేటీకి హాజరుకావాలని.. ఆయనకు ముందస్తుగానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీ జరగడానికి కొద్ది గంటల ముందే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావడానికి ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన తీరు పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్‌గా ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ మొదలైంది.

  Telangana Congress | BJP: బూట్లు ఇచ్చి బుక్కైపోయిన బండి సంజయ్ .. కాషాయం నేతల్ని కడిగిపారేస్తున్న తెలంగాణ కాంగ్రెస్

  Komatireddy Venkat Reddy: సోనియాగాంధీ నివాసంలో కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. చర్యలు తీసుకుంటారా ?

  అయితే మునుగోడు ఉప ఎన్నికలు పూర్తయ్యేవరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Telangana

  ఉత్తమ కథలు