హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ప్రియాంక గాంధీతో భేటీ తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..

Telangana: ప్రియాంక గాంధీతో భేటీ తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: ప్రియాంక గాంధీ ఆయనతో ఏం చర్చించారనే అంశాలపై క్లారిటీ వస్తేనే.. కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తి తగ్గిందా ? లేదా ? అనే విషయం తెలుస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్(Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆమెతో అనేక అంశాలపై చర్చించానని అన్నారు. తాను ఆమెకు అనేక విషయాలు చెప్పానని.. ఆమె కూడా తనకు పలు సూచనలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు. తామిద్దరి మధ్య భేటీ 40 నిమిషాలు పాటు సాగిందని వెల్లడించారు. ఈ భేటీ ఫలప్రదంగా జరిగిందని వివరించారు. ఈ భేటీలో ఏం జరిగిందనే విషయాలను తాను చెప్పబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత రాబోయే ఎన్నికలపై రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. పార్టీలో ఏ సమస్య ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దగ్గరకు వచ్చి చెప్పాలని ప్రియాంక సూచించినట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.


  ప్రియాంకతో జరిగిన సమావేశం అంశాలను బయటకు వివరించలేనని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనే అంశం సహా తెలంగాణకు సంబంధించిన ఏ ఇతర అంశాలపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఈ సమావేశం తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెత్తబడతారా ? కాంగ్రెస్‌ను ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేయడం ఆపుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రియాంక గాంధీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాంతించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.  అయితే ప్రియాంక గాంధీ ఆయనతో ఏం చర్చించారనే అంశాలపై క్లారిటీ వస్తేనే.. కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తి తగ్గిందా ? లేదా ? అనే విషయం తెలుస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుముఖంగా లేకపోయినప్పటికీ.. కొద్దిరోజుల్లోనే ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించారు ? ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏ విధమైన వైఖరితో ఉన్నారనే అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


  Telangana: కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎంపీ కోమటిరెడ్డి కీలక భేటీ.. అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడుతుందా ?


  Politics: పెళ్లిళ్లే ‘‘రాజకీయ వేదికలు’’.. బడా నేతల ఇళ్లల్లో మోగిపోతున్న బాజాలు


  మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ ప్రియాంక గాంధీ స్వయంగా చర్చలు జరపడంతో .. రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ వ్యవహారాలను ప్రియాంక స్వయంగా పర్యవేక్షించబోతున్నారనే వాదనకు బలం చేకూరినట్టయ్యింది. మరి.. తెలంగాణ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ.. వారంతా కలిసి పని చేసేలా చేయడంలో సక్సెస్ అవుతారా ? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Komatireddy venkat reddy, Telangana

  ఉత్తమ కథలు