Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS MAY FACE CRISIS IN THE UPCOMING 15 DAYS WITH KOMATIREDDY VENKAT REDDY AND OTHER LEADERS AK

Telangana Congress: రాబోయే 15 రోజుల్లో ఏం జరగనుంది ?.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

Telangana Congress: రాబోయే రోజుల్లో తన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని తాము కోరుకుంటున్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ముందే సమరశంఖం పూరించగా.. ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మరోసారి తనదైన శైలిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతేకాదు.. ఉన్నట్టుండి ఆయన కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో(Amit Shah) సమావేశం కావడం.. అది కూడా తన సోదరుడు, బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) భేటీ అయిన కొద్దిసేపటి వ్యవధిలోనే కలవడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. తన ఓటమి కోసం పన చేసిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ విషయంలో నేరుగా రాహుల్ గాంధీ, సోనియాగాంధీ దగ్గరే తేల్చుకుంటానని అన్నారు.

    తనకు సమాచారం ఇవ్వకుండా తన ఎంపీ నియోజకవర్గంలోని ఓ నాయకుడిని, అది కూడా తనకు వ్యతిరేకంగా పని చేసిన నేతను ఎలా పార్టీలో చేర్చుకుంటారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే ఈ నెల 21న మునుగోడులో (Munugodu) ఏర్పాటు చేయబోయే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారని.. అప్పుడే తాను బీజేపీలో చేరతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీంతో 21 నాటికి తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు ఏ రకంగా మారతాయో అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. రాబోయే రోజుల్లో తన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని తాము అనుకుంటున్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.



    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి మరో 15 రోజుల సమయం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింతగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాల పట్ల అసహనంగా ఉన్నారని చర్చ మొదలైంది.

    Komatireddy Rajagopal Reddy: తెలంగాణకు అమిత్ షా.. ఆ రోజే బీజేపీలో భారీగా చేరికలు

    Telangana : రాజగోపాల్‌రెడ్డి బాటలోనే దాసోజు శ్రవణ్ .. తెలంగాణ కాంగ్రెస్‌కి వరుస కష్టాలు

    ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండిస్తున్నా.. తాను పార్టీని వీడితే.. అందరికీ చెప్పే వెళతానని అన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడటంతో.. కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైందనే చర్చ సాగుతోంది. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలో దిగుతున్నారు. మొత్తానికి మరో 15 రోజుల్లో అమిత్ షా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో.. అప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎంతమంది బీజేపీ వైపు చూస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు