TS POLITICS TELANGANA CONGRESS LEADERS WANT RAHUL GANDHI TO TARGET TRS MORE THAN BJP IN WARANGAL MEETING AK
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆ లైన్లోనే వెళతారా ?.. తాము అనుకున్నట్టు చేస్తారా ?.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
తెలంగాణ, రాహుల్ గాంధీ (ప్రతీకాత్మక చిత్రం)
Rahul Gandhi| Telangana: తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ బీజేపీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఇక్కడి కాంగ్రెస్ నేతలంతా ఎక్కువగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పిస్తుంటారు.
చాలాకాలం తరువాత కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం వరంగల్లో జరగనున్న ఈ బహిరంగ సభకు లక్షమందికి పైగా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ.. బహిరంగ సభలో ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ బీజేపీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఇక్కడి కాంగ్రెస్ నేతలంతా ఎక్కువగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ను(TRS) లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పిస్తుంటారు.
ఒకవేళ బీజేపీని విమర్శించినా.. అది చాలా పరిమితమనే చెప్పాలి. తమ లక్ష్యం తెలంగాణలో టీఆర్ఎస్ను టార్గెట్ చేయడమే కాబట్టి.. ఆ లైన్ దాటి బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతగా ఆసక్తిచూపించరనే టాక్ ఉంది. అయితే మరికాసేపట్లో తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ సైతం ఇదే లైన్లో వెళతారా ? అన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి రేపుతోంది. నిజానికి తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ.. వరంగల్(Warangal) సభలో ఎక్కువగా అధికార టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. అలా చేయడం ద్వారా రాబోయే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తాయనే ఊహాగానాలకు కూడా తెరపడతాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.
ఇక రాహుల్ గాంధీ వరంగల్ సభలో టీఆర్ఎస్కు బదులుగా బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు బదులుగా జాతీయ స్థాయిలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీని టార్గెట్ చేయడం కాంగ్రెస్, రాహుల్ గాంధీకి (Rahul Gandhi) బాగా అలవాటు. అందుకే ఎక్కడ రాజకీయ సభ జరిగినా.. అక్కడి స్థానిక పార్టీల కంటే ఎక్కువగా బీజేపీని విమర్శించడానికి రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తుంటారు.
అయితే ఈసారి వరంగల్ సభలో మాత్రం అలా జరగకూడదని.. రాహుల్ గాంధీ బీజేపీ కంటే ఎక్కువగా టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పాలని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరి.. తెలంగాణకు రాబోతున్న రాహుల్.. టీఆర్ఎస్ను ఎక్కువగా టార్గెట్ చేస్తారా లేక టీఆర్ఎస్, బీజేపీ రెండింటినీ సమానంగా విమర్శిస్తారా ? అన్నది చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.