హోమ్ /వార్తలు /తెలంగాణ /

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు..నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు..నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ గుర్తు

కాంగ్రెస్ గుర్తు

దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంచలనం రేపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని విచారించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) సంచలనం రేపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని విచారించారు. దాదాపు 50 గంటల పాటు వారిని ఈడీ (enforcement directaret) విచారించింది. ఈ విచారణ సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. రాజకీయ కక్షతోనే బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

  తెలంగాణలో ఓ వైపు లిక్కర్‌ స్కాంపై సోదాలు జరుగుతున్న సమయంలోనే ఐదుగురు కాంగ్రెస్‌ నేతలకు ఈడీ (enforcement directaret) నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న గీతారెడ్డి, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడు ఈడీ (enforcement directaret) విచారణకు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు ఈడీ (enforcement directaret) నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, డీకే సురేష్ లను అక్టోబర్ 7న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అలాగే, క‌ర్నాట‌క కాంగ్రెస్ (Congress) నేత‌ల‌ను సైతం ఈడీ (enforcement directaret) త‌మముందు విచార‌ణ‌కు రావాల‌ని కోరింది. అక్టోబర్ 7న హాజరుకావాలని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్‌లకు కూడా ఈడీ సమన్లు ​​జారీ చేసింది.

  ఇక ఈ విచారణలో భాగంగా యంగ్ ఇండియా, డాటెక్స్ కలెక్షన్ గురించి నాయకులందరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యంగ్ ఇండియా ద్వారానే మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని ఈడీ  (enforcement directaret) అనుమానం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే నేడు కాంగ్రెస్ నాయకులను ఈడీ ప్రశ్నించనుంది. ఈ సంస్థ కోల్ కతాలోని బలిగంజ్ లోని శ్రీపల్లిలోని రాడాన్ స్ట్రీట్ లో ఉంది. ఇది ఓ అపార్ట్ మెంట్ లో ఉండగా..డేటాక్స్ సంస్థ యంగ్ ఇండియాకు కోటి రూపాయలు చెల్లించిందని ఆరోపించారు. అయితే ఇచ్చిన ఋణం తిరిగి రాలేదు. కానీ ఈ ఋణం చెల్లించినప్పుడు యంగ్ ఇండియా ఇప్పుడే విలీనం చేయబడిందని ఈడీ వర్గాలు తెలిపాయి.

  నేషనల్ హెరాల్డ్ కేసుకు National Herald Case  సంబంధించి 2014 జూన్ 26న కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సమన్లు అందాయి. ఈ కేసులో 2015 డిసెంబర్ 19న  సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక 2016లో ఈ కేసును రద్దు చేయాలనీ కాంగ్రెస్ (Congress) కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చారు. కానీ దర్యాప్తు సంస్థలు మళ్లీ ఈ కేసును తెరిచాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కక్షతోనే అధికార బీజేపీ పార్టీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.

  Published by:Rajashekar Konda
  First published:

  ఉత్తమ కథలు