కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul gandhi) రెండు రోజుల తెలంగాణ పర్యటన (Telangana tour) ముగిసింది. ఈ పర్యటన సక్సెస్ అయిందని..పార్టీలో మంచి జోష్ ఇచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంతోష పడుతున్నారు. రాహుల్ సైతం వరంగల్ సభ బాగా జరిగిందంటూ అభినందించారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు.. సీట్ల కేటాయింపు పైనా రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ పర్యటన పైన టీఆర్ఎస్ - ఎంఐఎం - బీజేపీ విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు తమ నేత పర్యటన తో కొత్త రాజకీయం మొదలైందని చెబుతున్నారు. రాహుల్ పర్యటన సక్సెస్ అయిందని పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పారు. అయితే రాహుల్ పర్యటనపై సినీ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash raj) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాహుల్ పర్యటనపై ఓ ట్వీట్ వదిలారు ప్రకాశ్ రాజ్. రాహుల్ గాంధీ గారూ తెలంగాణను ఓ విజనరీ ఉన్న నాయకుడు నడిపిస్తున్నాడు. మీ దగ్గర ఉన్న ఫూల్స్‌తో (Bunch of Fools) మీరు ఏం ఆఫర్ చేస్తున్నారని ట్వీట్లో విమర్శించారు. దీంతో ప్రకాష్ రాజ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Telangana Congress leaders) ధ్వజమెత్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga reddy) ప్రకాశ్ రాజ్‌పై విమర్శనాస్త్రాలు సంధించా రు.
Mr @RahulGandhi .. Telangana is governed by a visionary #KCR garu.. tell us what you have to offer with your bunch of fools… #justasking https://t.co/XPJJZLZ0dd
— Prakash Raj (@prakashraaj) May 6, 2022
ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని.. గ్లామర్ అవుట్ అయిపోయిందని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు సినిమాలు లేవని.. సినిమా వాళ్లకు ఇదో తమాషా అయిపోందని ఆయన మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ గ్లామర్ అవుట్ అయిపోందని.. ఈజీగా రాజ్యసభ ఎక్కడ వస్తుందో అక్కడి చేరాడని జగ్గారెడ్డి అన్నారు. ప్రకాశ్ రాజ్.. ఒక్క రోజు కూడా పబ్లిక్‌లోకి వచ్చింది లేదన్నారు. ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఇదే ప్రకాష్ రాజు కేసీఆర్‌ను తిడుతారని.. ఆ రోజు వస్తుందన్నారు జగ్గారెడ్డి .
ప్రకాష్ రాజ్ ఒక బఫూన్..
కాంగ్రెస్ (congress) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) సైతం ప్రకాశ్ రాజ్‌పై మండిపడ్డారు . ప్రకాష్ రాజ్ ఒక బఫూన్ అని.. ఆయన అంత మొనగాడైతే ‘‘మా’’ ఎన్నికల్లో (maa elections) ఎందుకు ఓడిపోతాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ (kcr) మెప్పు కోసమే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని.. రాజ్యసభ సీటు ఇస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రెండ్రోజుల రాహుల్ టూర్ జోష్ నింపిందని.. పనిచేసేవారికే టికెట్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్నెళ్ల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor prakash raj, Jaggareddy, Rahul Gandhi, Telangana Politics, TS Congress