హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress: కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. నవంబర్ 6 తరువాత ఏం జరుగుతుందో..?

Congress: కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. నవంబర్ 6 తరువాత ఏం జరుగుతుందో..?

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

TS Politics: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మాత్రం ఇందుకు భిన్నంగా ఉండొచ్చని.. తెలంగాణలో బీజేపీ బలపడితే కాంగ్రెస్ నేతలు అటు వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో సంక్షోభం వచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నిక కోసం తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్‌తో పోల్చితే టీఆర్ఎస్, బీజేపీ (BJP) హోరాహోరీగా పోరు సాగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఉప ఎన్నికల్లో ఉనికి చాటుకుంటే పెద్ద విషయమని.. టీఆర్ఎస్(TRS), బీజేపీలతో(BJP) పోటీ పడి కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించినా.. అది ఆ పార్టీకి ఊరట కలిగించే విషయమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనే అంశం కూడా రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరిగింది. కానీ ఫలితాలు వెలువడిన తరువాత మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా కాంగ్రెస్ మీదే కనిపించింది.

  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఆయనను గట్టిగానే టార్గెట్ చేసింది. అసలు హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించింది. తెలంగాణ కాంగ్రెస్‌లో హుజూరాబాద్ అగ్గి చల్లారేందుకు దాదాపు రెండు వారాలకుపైనే సమయం పట్టింది. ఒకవేళ మునుగోడులోనూ హుజూరాబాద్ తరహా ఫలితం రిపీటైతే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. మునుగోడులో తాము గెలిస్తే.. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ భావిస్తోంది.

  అనేక మంది కాంగ్రెస్ నేతలు సైతం మునుగోడు ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా ? లేదా ? అనే అంశంపై నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నారని తెలంగాణ రాజకీయ వర్గాలు టాక్ వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు బట్టి కాంగ్రెస్‌లో ప్రకంపనలు ఉంటాయని ఆ పార్టీ వర్గాల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తరువాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. కానీ ఆ పార్టీ నుంచి నేతలు వీడిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.

  KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

  Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

  కానీ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మాత్రం ఇందుకు భిన్నంగా ఉండొచ్చని.. తెలంగాణలో బీజేపీ బలపడితే కాంగ్రెస్ నేతలు అటు వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో సంక్షోభం వచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో పోరాడేందుకు ఓ వైపు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటంటే.. మరోవైపు ఈ ఉప ఎన్నికల తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అని మరికొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు