హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana| Congress: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వస్తే అమలు చేసే హామీలు ఇవే.. ప్రకటించిన సీనియర్ నేత

Telangana| Congress: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వస్తే అమలు చేసే హామీలు ఇవే.. ప్రకటించిన సీనియర్ నేత

భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)

భట్టి విక్రమార్క (ఫైల్ ఫోటో)

Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ హామీలు ఇస్తుందో అనే అంశంపై పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత తెలంగాణలోనూ తమకు అధికారం ఖాయమనే భావనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ హామీలు ఇస్తుందో అనే అంశంపై పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళా మండలాలకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటుగా ఫ్రీగా రేషన్ బియ్యం, సరుకులు కూడా ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేదని, కాంగ్రెస్‌ (Congress) పంచిన అటవీభూములను కేసీఆర్‌ గుంజుకున్నారని విమర్శించారు. పోడు భూముల పట్టాలను గిరిజనులు చూపించారని, పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని చెప్పారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని, రైతులు ఆందోళనలో ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. భట్టి పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

ఇక ఇదే సభలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరదాగా సవాల్ విసిరారు.

Telangana: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ మీటింగ్..చర్చించే కీలక అంశాలివే..!

Telangana: తలసానిపై రేవంత్ వ్యాఖ్యలకు భగ్గుమన్న గొల్ల కురుమలు..ఇందిరాపార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కోమటిరెడ్డి సవాల్‌కు స్పందించారు. 12 కాదని, 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలను కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో వేదికమీద ఉన్న నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహాలో పోటీ పడి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు