తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ మూడో స్థానం దక్కించుకోవడంపై ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. రాబోయే ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. మనం కూడా వంద కోట్ల రూపాయలు పెడదామని జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్తో తాడోపేడో తేల్చుకుందామని.. బీజేపీని (BJP) అణగదొక్కుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు. పోలీసులు కేసీఆర్కు భయపడి డ్యూటీ చేయొద్దని జగ్గారెడ్డి సూచించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. పోలీసులను తమను ఇబ్బంది పెట్టబోమని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేతలు అండగా ఉంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటను కొనోగులు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై కొందరు అవినీతి అరోపణలు చేస్తున్నారని..దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అవినీతికి పాల్పడుతుందా ? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేసే వారికి చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని ఆరోపించారు.
ఇక మరికాసేపట్లో మహారాష్ట్రలోకి అడుగుపెట్టనున్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ..తెలంగాణను విడిచి వెళ్లడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలు ఎలా పని చేస్తున్నారో తన కళ్లతో చూశానని చెప్పారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిశానని వివరించారు. దేశానికి తెలంగాణ పాఠం చెప్పగలదని అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు.
Munugode Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ గెలవ లేదు .. గెలిచిన వాళ్ల పేర్లు చెప్పిన బండి సంజయ్
BJP in Munugode : మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా బీజేపీకి భారీ లాభం
తెలంగాణ కలలను టీఆర్ఎస్ విచ్ఛన్నం చేసిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనుల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి భూములు తిరిగి వారికి ఇప్పిస్తామని అన్నారు. తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరని అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత రైతు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. మెనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. సభ అనంతరం నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర అనంతరం మహారాష్ట్రలోకి అడుగుపెట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagga Reddy, Telangana