Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS IS USING MATTHIA AGAINST KA PAUL IN POLITICS SNR BK HYD

Telangana: మ‌త్త‌య్య vs కేఏపాల్..ఎవ‌రి వెనుక ఎవ‌రున్నారు? ఎవ‌రు వీళ్ల‌ను ఆడిస్తున్నారు

(పొలిటకల్ గేమ్)

(పొలిటకల్ గేమ్)

Telangana:తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల నుంచి పిల్ల పార్టీలు పుట్టుకొస్తున్నాయని తెలుస్తోంది. కేఏ పాల్ వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌ హస్తముందనే ప్రచారం జరుగుతుంటే..పాల్‌కి చెక్ పెట్టడానికి కాంగ్రెస్‌ కొత్త అస్త్రాన్ని ఉపయోగిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  (M.Balakrishna,News18,Hyderabad)
  తెలంగాణ(telangan)రాజకీయాల్లో కొత్త పార్టీలు, మునుపెన్నడు చూడని వ్యక్తులు షడన్‌గా తెరపైకి వస్తున్నారు. ఈ పరిణామం కేఏ పాల్‌ (KA Paul)ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ప్రజాశాంతి పార్టీ పేరుతో కేఏ పాల్ హడావుడి చేసినప్పటికి ప్రయోజనం శూన్యమని తేలిపోయింది. అప్పుడు అమెరికా(America)ప్లైట్ ఎక్కిసిన కేఏపాల్ మ‌ళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌నే చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ అమెరికా నుంచి శంషాబాద్‌(Shamshabad)లో ల్యాండ్ అయ్యారు.

  రాజకీయ ఎత్తులు..
  తన ఎంట్రీతోనే తెలంగాణ రాజకీయ ప్రస్తావనతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, సీఎంపై నిప్పులు చెరిగారు కేఏ పాల్. బంగారు తెలంగాణ త‌న‌తోనే సాధ్య‌మ‌ని తెలంగాణ సీఎంగా ఒక్క ఛాన్స్ ఇస్తే ల‌క్ష కోట్లు, ప్రపంచ దేశాల ప్ర‌ధానులు హైద‌రాబాద్‌లో ఉంటారంటూ తన మార్క్‌ మాటలతో తెలంగాణ రాజ‌కీయాల్లో కాస్త ఎంటర్‌టైనమెంట్‌ జోడించారు కేఏపాల్. రావడం, తెలంగాణలో పోటీ చేస్తాననడం, తానను సీఎంగా గెలిపించమని కోరడం సంగతి పక్కన పెడితే ఇంత డేర్‌ స్టెప్ తీసుకోవడానికి కేఏ పాల్‌ వెనుక ఎవరున్నారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

  తెర వెనుక ఉన్నదెవరూ..
  కేఏ పాల్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతుంటే.కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికి కేసీఆర్ కేఏ పాల్‌ని వాడుకుంటున్నార‌నే విమర్శలు వినిపిస్తున్నాయి.  కేఏ పాల్‌ వెనుక ఎవరుంటే మనకేంటి మనం కూడా అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అదే సామాజికవర్గానికి చెందిన మ‌త్త‌య్య‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. కేఏపాల్‌పై మత్తయ్య విరుచుకుపడటం చూస్తుంటే దీని వెనుక కచ్చితంగా టికాంగ్రెస్ పార్టీ నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

  పాల్‌కి వ్యతిరేకంగా మత్తయ్య..
  తెలంగాణ రాజ‌కీయాల్లో హాడ‌విడి చేస్తోన్న కేఏపాల్ వ్య‌వ‌హారానికి చెక్ పెట్టాడానికి మ‌త్త‌య్య‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపిన‌ట్లు స‌మాచారం. అయితే ఒక వెళ కేఏపాల్ ను అధికార‌పార్టీ లేక బిజేపీ న‌డిపించిన మ‌త్త‌య్య‌ను పాల్ కు వ్య‌తిరేకంగా దింప‌డం క‌రెక్ట్ వ్యూహామ‌ని కాంగ్రెస్ భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. గతంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఓటుకు నోటు కేసులో ఉన్న మ‌త్త‌య్య అప్ప‌ట్లో తాను ఆ కేసులో అప్రూవ‌ర్ గా మార‌తానికి కూడా కోర్టు కు విన్న‌వించుకున్నారు. త‌రువాత మ‌త్త‌య్య ఎక్క‌డ అడ్ర‌స్ లేరు. స‌డెన్ గా కేఏపాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల‌కే మ‌త్త‌య్య పాల్ కు కౌంట‌ర్ గా ప్ర‌త్యేక్ష‌మ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాం ఉంద‌ని అంటున్నారు. కేఏపాల్ కొంచ‌మైన ఓట్లు చీల్చ‌కుండా జాగ్ర‌త్త ప‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోత‌మ‌కు మెరుగైన ఫ‌లితాలు ఉంటాయ‌నే ఆశ‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి మ‌త్త‌య్య వ‌ర్సెస్ కేఏపాల్ వ్య‌వ‌హారంలో ఎవ‌రి వెనుక ఎవ‌రు అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Ka paul, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు