Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS IS BOUND TO FALL TO THE BJP WHICH IS ACTING UNDEMOCRATICALLY SNR

Hyderabad : అప్రజాస్వామిక పాలన .. అనాలోచిత నిర్ణయాలు ..బీజేపీ పతనం ఖాయం: తెలంగాణ కాంగ్రెస్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana: బీజేపీ రాజ్యం కూలిపోయే సమయం ఆసన్నమైందని తెలంగాణ కాంగ్రెస్ అంటోంది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తున్న కమలం పార్టీ పతనం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతను కుట్ర పూరితంగా మోసం చేస్తున్న మోదీని ఒక అలెగ్జాండర్‌తో పోల్చింది. అలెగ్జాండర్ పతనమైనట్లే బీజేపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్ నేతలు.

ఇంకా చదవండి ...
తెలంగాణ కాంగ్రెస్‌(Congress)నేతలు బీజేపీ(BJP)పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతూ దొడ్డిదారిలో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని బీజేపీని విమర్శిస్తున్నారు. అగ్నిపథ్(Agneepath)విషయంలో మోదీ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వాలు కూల్చివేసే విషయంలో బీజేపీ సిద్ధాంతాలకు విరుద్దంగా పని చేస్తూ వాళ్ల గోతిని వాళ్లే తొవ్వుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు కమలం పార్టీని తూర్పాబడతున్నారు.

బీజేపీ అనాలోచిత నిర్ణయాలతోనే అనర్ధం..
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే కాంగ్రెస్‌ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శన బాణాలు విసురుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను పరామర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. అగ్నిపథ్ విషయంలో ప్రధాని అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందన్నారు. మూడేళ్లుగా ఆర్మీలో కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మూడేళ్లుగా ఆర్మీలో నియామకాలు చేపట్టలేదన్నారు. 2020లో ఫిజికల్ ఎగ్జామ్స్ పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్‌. అగ్నిపథ్ ఉద్యోగులకు నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం ఎంత వరకు సమంజసమన్నారు.అగ్నిపథ్ విషయంలో బీజేపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామన్నారు. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ నేతుల.



ప్రజాస్వామ్యం ఖూనీ..
దేశంలోని నిరుద్యోగ యువతను ఈవిధంగా మోసం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శిస్తే ...కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసే పనిలో పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌ని డమ్మీని చేసి అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలో లేని గోవా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్ , కర్నాటకలో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ గద్దెనెక్కిందన్నారు. ఇప్పుడు మహరాష్ట్రలో అదే ఫార్ములాను అప్లై చేస్తోందని జగ్గారెడ్డి బీజేపీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ఏనాడు ఇలాంటి కూల్చివేత రాజకీయాలు చేయలేదన్నారాయన.

ఇది చదవండి: బీజేపీ భారీ స్కెచ్.. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి.. ఎవరూ ఊహించని విధంగా..


 


కాంగ్రెస్‌ని అణచివేసే కుట్ర..
రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకుండా ,సోనియా, ప్రియాంక గాంధీలను ప్రజల వద్ద కు వెళ్ళకుండా బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు జగ్గారెడ్డి. గడిచిన 8ఏళ్లలో కాంగ్రెస్ నాయకత్వాన్ని తొక్కేసి ప్రాంతీయ పార్టీలను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ సీఎం జగన్‌ బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సగం అటు సగం ఇటుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. మొత్తం మీద ప్రధాని మోదీ ప్రవర్తన చూస్తుంటే అలెగ్డాండర్‌ను గుర్తు చేస్తోందన్నారు. అలెగ్జాండర్ పతనైమట్లే..బీజేపీ పతనం అవుతుంది. చివరకు అలెగ్జాండర్‌కి పట్టిన గతే పడుతుందని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ఇది చదవండి: మంత్రి ఎర్రబెల్లి మాటలపై మండిపడుతున్న యువత .. కాళీ బీరు సీసాలతో అక్కడే నిరసనలు


Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Modi, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు