హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదా ?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదా ?

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

Congress: మహిళా అభ్యర్థిని ఎంపిక చేయడం తమకు కలిసొచ్చే అంశమని భావిస్తున్న ఆ పార్టీ నేతలు.. అదే సమయంలో ప్రియాంక గాంధీ మునుగోడుకు వచ్చి ప్రచారం నిర్వహిస్తే.. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా కాంగ్రెస్ రేసులో నిలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ, టీఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్‌కు(Congress) జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఉప ఎన్నికలో మెరుగైన ఫలితం సాధిస్తేనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీతో ధీటుగా పోరాడేందుకు కాంగ్రెస్ శక్తి సరిపోవడం లేదనే వాదన కూడా ఉంది. అయితే మునుగోడు నియోజకవర్గ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చాలావరకు సానుభూతి ఉందని.. దాన్ని ఓట్లుగా మలుచుకోగలిగితే.. తమకు చాలావరకు లాభం కలుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మునుగోడులో(Munugodu) తమ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన ప్రియాంక గాంధీ(Priyanka Gandi) ప్రచారం నిర్వహిస్తే.. అది తమకు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉండేదనే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రచారానికి తాను వస్తానని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రియాంక గాంధీ చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మునుగోడులో కాంగ్రెస్ తరపున మహిళా అభ్యర్థి పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది.

మహిళా అభ్యర్థిని ఎంపిక చేయడం తమకు కలిసొచ్చే అంశమని భావిస్తున్న ఆ పార్టీ నేతలు.. అదే సమయంలో ప్రియాంక గాంధీ మునుగోడుకు వచ్చి ప్రచారం నిర్వహిస్తే.. టీఆర్ఎస్ , బీజేపీలకు ధీటుగా కాంగ్రెస్ రేసులో నిలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లోనూ ఫోకస్ పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ప్రియాంక గాంధీని సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదనే టాక్ కూడా ఉంది.

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్..పీడీ యాక్ట్ పై కమిటీ కీలక తీర్పు

Munugodu: మంత్రులు, MLAలకు నెల జీతం కట్ చేయాలి .. కారణం మునుగోడు బైపోలే అంటున్న సోషల్ డెమోక్రటిక్ ఫోరం

మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్యనేతలు, జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్న సమయంలో... ప్రియాంక గాంధీని కూడా మునుగోడు ప్రచారపర్వంలోకి దింపాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కంటే ఎక్కువగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్రపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేస్తోందనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరి.. రాహుల్ గాంధీ పాదయాత్ర మునుగోడు కాంగ్రెస్‌కు ఏ మేరకైనా ఉపయోగపడుతుందేమో చూడాలి.

First published:

Tags: Priyanka Gandhi, Telangana

ఉత్తమ కథలు