TS POLITICS TELANGANA CONGRESS GIVING MORE PRIORITY TO INTERNAL DISPUTES OTHER THAN RACHABANDA AK
Congress: రచ్చబండ కంటే ఇతర రచ్చకే ప్రాధాన్యత.. కాంగ్రెస్‌లో మళ్లీ అలాగే జరుగుతోందా ?
కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
Telangana Congress: కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా చేపట్టి.. ఎప్పటిలాగే తమ రచ్చను కంటిన్యూ చేస్తున్నారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఢిల్లీ పెద్దలు లోకల్ లీడర్లకు ఎన్ని సూచనలు, వార్నింగ్‌లు ఇచ్చినా.. నేతలు మాత్రం తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించి వెళ్లారు రాహుల్ గాంధీ. ఆయన ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 21 నుంచి రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్(Congress) పార్టీ. ఆ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే స్థానిక నాయకత్వాలు నిర్వహిస్తున్నాయి. అయితే పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం కంటే ఎక్కువగా ఆ నేతలు చేసిన కామెంట్స్ కారణంగా చెలరేగిన రచ్చ మీదే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇటీవల రెడ్ల గురించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన కామెంట్స్‌పై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఇక తాను నల్లగొండ నుంచి పోటీ చేస్తానని.. తన సీఎం పదవి మీద ఆశ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో రైతులకు మేలు చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఊరికి వెళ్లి ఈ అంశాలను వివరించగలిగితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా చేపట్టి.. ఎప్పటిలాగే తమ రచ్చను కంటిన్యూ చేస్తున్నారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మొదటి రెండు మూడు రోజులు మినహా ఈ కార్యక్రమాన్ని ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదని.. మళ్లీ ఎవరి తీరు వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ రూల్స్ పట్టించుకోవడం లేదా ?..మళ్లీ అలాగే జరుగుతోందా ?
అనవసరమైన వివాదానలు తెరపైకి వస్తే.. తాము చేపట్టబోయే కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశ్యం పక్కదారి పడుతుందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయినట్టున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఓ వైపు తాము చేయాలనుకుంటున్న కార్యక్రమాల గురించి తప్ప ఇతర విషయాలను పట్టించుకోకుండా తెలంగాణ బీజేపీ ముందుకు సాగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కాకుండా ఇతర విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.