Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS DOING EXERCISE ON FINALIZING MUNUGODU CANDIDATE TO CONFIRM AS EARLY AS POSSIBLE AK

Munugodu| Congress: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిపై త్వరలోనే తేల్చేశారా ?.. ఈసారి భిన్నంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugodu: సాధ్యమైనంత తొందరగా మునుగోడులో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి.. ఆ తరువాత నాయకులందరి మధ్య సమన్వయం చేసే బాధ్యతను మొదలుపెట్టాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడులో కచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కీలకమైన అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీలో కసరత్తు జరుగుతోంది. ఏఐసీసీ ఇంఛార్జ్ బోసురాజుతో జానారెడ్డి (Janareddy) సమావేశం కావడం.. ఆ తరువాత ఆయన మునుగోడు (Munugodu)  సీటు ఆశిస్తున్న చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత, పల్లె రవితో కూడా మాట్లాడటంతో.. ఈ దిశగా కాంగ్రెస్ (Congress) పార్టీ తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు రేపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్  (Hyderabad)  రానున్న నేపథ్యంలో... అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    సాధ్యమైనంత తొందరగా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి.. ఆ తరువాత నాయకులందరి మధ్య సమన్వయం చేసే బాధ్యతను మొదలుపెట్టాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుందనే విషయం ప్రజల్లోకి వెళుతుందని భావనలో కాంగ్రెస్ పార్టీ ఉందని సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. మిగిలిన నాయకుల నుంచి ఎంతో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకావశం ఉంటుందని.. అభ్యర్థి ఎంపికను తొందరగా పూర్తి చేయడం ద్వారా ఈ అసంతృప్తులు కూడా తగ్గుముఖం పట్టి నాయకులంతా కలిసి పని చేసేందుకు వీలు కలుగుతుందని టీపీసీసీ భావిస్తోంది.



    అందుకే అభ్యర్థిగా సరైన నాయకుడిని ఎంపిక చేయడంతోపాటు సాధ్యమైనంత తొందరగా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలని టీపీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం సైతం ఈ విషయంలో టీపీసీసీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని సూచించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. నేటి నుంచే విధుల్లోకి.. మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు

    Rajanna Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు అంతా తానైన నర్సింగరావుకు ఈసారి పదవి దక్కేనా?

    బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచన కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్నప్పటికీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టేందుకు సామాజిక సమీకరణాల అంశాన్ని పక్కనపెట్టాల్సిన అవసరం వస్తే.. ఆ విధంగానూ ముందుకు సాగే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలంతా మునుగోడు బాట పట్టాలని.. ఆ విధంగా నేతలంతా సిద్ధంగా ఉండాలనే సంకేతాలను కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నేతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా ఈసారి అభ్యర్థి ఎంపిక ప్రక్రియను తొందరగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana

    తదుపరి వార్తలు