హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: కాంగ్రెస్ రూటు మారుస్తోందా ?.. టీఆర్ఎస్‌తో సమానంగా బీజేపీ ?

Telangana Congress: కాంగ్రెస్ రూటు మారుస్తోందా ?.. టీఆర్ఎస్‌తో సమానంగా బీజేపీ ?

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana Congress: తెలంగాణలో బలపడేందుకు ఇంతకాలంగా కేవలంను అధికార టీఆర్ఎస్‌ను మాత్రమే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇక టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని కూడా గట్టిగా టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానం ఏమిటన్నది ఇప్పుడు ఎవరికీ అర్థంకాని ప్రశ్న. ప్రస్తుతానికి ప్రజాప్రతినిధుల సంఖ్య ప్రకారం ఆ పార్టీది తెలంగాణలో(Telangana) రెండో స్థానమే అయినా.. భవిష్యత్తులో మాత్రం ఆ పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తరువాత స్థానంలోనే ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కంటే బీజేపీ(Bjp) ఎక్కువగా బలపడుతుండటమే. అయితే బీజేపీని ఓవర్ టేక్ చేసి తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే బీజేపీ కాంగ్రెస్‌కు(Congress) ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తెలంగాణలో దూసుకుపోతోంది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా స్థానిక నాయకత్వానికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది.

  మరోవైపు తెలంగాణలో బలపడేందుకు ఇంతకాలంగా కేవలంను అధికార టీఆర్ఎస్‌ను మాత్రమే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇక టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని కూడా గట్టిగా టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి చాలాకాలంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఎక్కువగా టీఆర్ఎస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం బీజేపీని విమర్శించే ప్రత్యర్థి టీఆర్ఎస్ కాబట్టి బీజేపీని విమర్శించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే భావనలో ఉంటూ వచ్చారు ఆ పార్టీ నేతలు.

  అయితే ఇప్పుడు టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని కూడా సమానంగా టార్గెట్ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. లేకపోతే రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీతో పోటీ పడే విషయంలో తాము వెనుకబడిపోతామని ఆ పార్టీ యోచిస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్‌కు కౌంటర్‌గా కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది.

  CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్‌, పీవీ బొమ్మలతో..

  CM KCR | Undavalli : కేసీఆర్‌తో ఉండవల్లి ఏం మాట్లాడారు? -ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు వ్యూహాలు!

  ఈ క్రమంలోనే ఇటీవల రఘునందన్ రావు చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్, ఆ పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి విభాగ సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులోనూ బీజేపీకి ధీటుగా టీఆర్ఎస్‌పై రాజకీయంగా పోరాటం చేస్తూనే.. బీజేపీని తీరును కూడా ప్రజల్లో ఎండగట్టేందుకు ఆ పార్టీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మొత్తానికి ఇంతకాలం కేవలం టీఆర్ఎస్‌నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్.. ఫ్యూచర్‌లో బీజేపీని కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తుందేమో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Congress, Telangana

  ఉత్తమ కథలు