Home /News /telangana /

TS POLITICS TELANGANA CONGRESS CONDUCTING SURVEY ON FOUR CANDIDATES TO FIELD BETTER PERSON IN MUNUGODU BY ELECTIONS AK

Congress| Munugodu: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు.. ఆ నలుగురిపైనే సర్వే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugodu By Elections: కాంగ్రెస్ తరపున ఎవరు బరిలో ఉండాలనే దానిపై ఆ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటోందని సమాచారం. ఈ అభిప్రాయ సేకరణలో నలుగురు పేర్లు ఉన్నాయని సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ స్థానం అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందులో ఇది తమ సిట్టింగ్ సీటు కావడం.. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో.. ఇక్కడ సత్తా చాటి మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల రణక్షేత్రంలోకి మిగతా పార్టీల కంటే ముందుగానే దూకేసింది. కొద్దిరోజుల క్రితమే అక్కడ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా అనేక మంది కాంగ్రెస్ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరై.. మునుగోడులో(Munugodu) కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

    అయితే బీజేపీ తరపున మళ్లీ బరిలో ఉండబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,(Komatireddy Rajagopal Reddy) అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎదుర్కొవాల్సిన బలమైన నేతను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఇందుకోసం ఆ పార్టీ అప్పుడే కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలో ఉండాలనే దానిపై ఆ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటోందని సమాచారం. ఈ అభిప్రాయ సేకరణలో నలుగురు పేర్లు ఉన్నాయని సమాచారం.



    వారిలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, కాంగ్రెస్ యువనేత కైలాష్ నేతతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఎవరు తమ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో ఉంటే బాగుంటుందనే దానిపైనే కాంగ్రెస్ ఓ సర్వే చేయిస్తోందని.. ఈ సర్వే ఆధారంగానే ఈ నలుగురిలో ఒకరిని ఆ పార్టీ తమ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించబోతోందని సమాచారం.

    Independence day 2022: తెలంగాణలో కోటి 20లక్షల జాతీయ జెండాల పంపిణి .. 15వ తేదిన ప్రతి ఇంటిపై కనిపించాలని పిలుపు

    BJP | Jayasudha : బీజేపీలోకి సహజనటి .. ఆ రోజునే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు

    బీజేపీ, టీఆర్ఎస్‌కు పోటీగా ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం నేతలు, ఇద్దరు బీసీల నేతల ఎంపికపై కసరత్తు చేస్తోందని.. ఇందులో భాగంగానే సర్వేలు చేయిస్తోందని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న అంతర్గత సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ.. టికెట్ కోసం రేసులో ఉన్న పాల్వాయి స్రవంతి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కైలాష్ నేత, చెరుకు సుధాకర్‌లలో ఒకరికి టికెట్ రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక ప్రక్రియను కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలనే భావనలో కాంగ్రెస్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు