హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR National Party: దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్.. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా ఆ సమయానికి..

KCR National Party: దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్.. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా ఆ సమయానికి..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారు. ఇందుకోసం దసరా రోజున ఆయన ముహూర్తాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న సీఎం కేసీఆర్(CM KCR) .. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ఇందుకోసం దసరా రోజున ఆయన ముహూర్తాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ నెల 5న దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు ఆయన టీఆర్ఎస్ఎల్పీ(TRSLP) సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ పేరును ప్రకటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి జాతీయ పార్టీ ఏర్పాటు అంశానికి సంబంధించి కేసీఆర్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని.. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇందుకు సంబంధించి ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని కథనాలు వచ్చాయి.

  అయితే ముహూర్తాలను ఎక్కువగా నమ్మే సీఎం కేసీఆర్ .. దసరా రోజు మంచి ముహూర్తం ఉందని పండితులు సూచించడంతో... ఆ రోజు లాంఛనంగా పార్టీ ప్రకటన చేయనున్నారని.. ఆ తరువాత మిగతా అంశాలపై ఆయన దృష్టి పెడతారని తెలుస్తోంది. అయితే ఇప్పటికప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై ప్రకటన చేసినా.. మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక తరువాతే జాతీయ పార్టీ అంశంపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీకి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేసినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.

  అయితే దేశవ్యాప్తంగా రైతులను ఆకర్షించే తన జాతీయ పార్టీ, అజెండా ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. దీనికి భారత రైతు సమితి పేరును కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సైతం టీఆర్ఎస్ పేరు మీదే ఆ పార్టీ ఎదుర్కొంటుందని.. ఆ తరువాత జరిగే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్‌ను పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా తీర్చుదిద్దుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ఓ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సమాలోచనలు చేసిన కేసీఆర్.. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి నేతలను సంప్రదించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు.

  Telangana : బాన్సువాడలో మళ్లీ పోటీ చేసేది నేనే .. వారసుడి ఆశలపై నీళ్లు చల్లిన స్పీకర్

  Munugode Bypoll : నవంబర్ 8న మునుగోడు పోలింగ్?త్వరలో ఎన్నికల షెడ్యూల్!

  అయితే ఆయన ఈ మొత్తం అంశాలపై ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై రోడ్ మ్యాప్ ఖరారు చేస్తున్నారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ఈ ప్రశ్నలన్నింటికి ఓ సమాధానం కూడా ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దసరా రోజున కీలక ప్రకటన చేయబోతున్న కేసీఆర్.. ఆ తరువాత ఏ రకంగా రాజకీయ అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు