హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR Yadadri: రేపు యాదాద్రికి కేసీఆర్.. ఆయన వెంట నలుగురు దాతలు

KCR Yadadri: రేపు యాదాద్రికి కేసీఆర్.. ఆయన వెంట నలుగురు దాతలు

కేసీఆర్, యాదాద్రి (ఫైల్ ఫోటో)

కేసీఆర్, యాదాద్రి (ఫైల్ ఫోటో)

Telangana: జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) లేదా భారతీయ రైతు సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్.. అంతకంటే ముందు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ వెంట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దివ్య విమాన గోపురానికి 4 కిలోల బంగారం విరాళంగా ఇచ్చే దాతలు కూడా రాబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) లేదా భారతీయ రైతు సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో యాదాద్రి (Yadadri) శివాలయ ఉద్ఘాటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ యాదాద్రికి రానున్నారు. పలు పార్టీల జాతీయ నేతలను కూడా కేసీఆర్ ఆహ్వానించినట్టుగా సమాచారం.

  2024లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ (Kcr) ప్రకటించారు. ఇందు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ అధ్యయం చేశారు. ప్రశాంత్ కిషోర్(Prashant Kishore)  టీమ్ ఈ విషయమై కేసీఆర్ తో కలిసి పనిచేసింది. రైతులు, విద్యార్ధులు, మహిళలు, యువత ఏం కోరుకుంటున్నారనే విషయమై కేసీఆర్ టీమ్ అధ్యయనం చేసింది. ప్రజల డిమాండ్లను జాతీయ పార్టీ ఎజెండాలో కేసీఆర్ చేర్చనున్నారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ పార్టీ ఏర్పాటుపై కసరత్తులు నిర్వహిస్తున్నారు.

  పార్టీ ఏర్పాటు కంటే ముందుగానో ఆ తర్వాతో కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు. 2018 ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కూడా కేసీఆర్ యాగం నిర్వహించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఢిల్లీ లేదా యూపీలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలో తమ పార్టీ విధానాలను కేసీఆర్ ప్రకటించనున్నారు.

  YS Sharmila: షర్మిల ప్లాన్ సగం మాత్రమే సక్సెస్.. మిగతా సగం వర్కవుట్ కావడం లేదా ?

  Telangana Rains: ఈ ఆరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ

  మరో వైపు అక్టోబర్‌లో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. పలు పార్టీల నేతలను కూడా సీపీఐ నేతలు మహసభలకు ఆహ్వానించారు. ఈ మహాసభల వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిపై సంకేతాలను ఇవ్వాలని సీపీఐ భావిస్తుంది. దీంతో సీపీఐ మహసభలకు పలు పార్టీల నేతలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆహ్వానించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు