హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| Munugodu: బీజేపీ నేతలు మునుగోడు ఉప ఎన్నికపై ఎక్కువగా ఫోకస్ చేయడం.. ఆ పార్టీ జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం ఉండటంతో.. టీఆర్ఎస్ కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహరచనల్లో మునిగిపోయాయి. దసరా తరువాత క్షేత్రస్థాయిలోకి దిగడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాయి. ఇక మునుగోడులో బీజేపీ గెలుపును అడ్డుకుని అక్కడ గులాబీ జెండా ఎగరేలా చూసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్(TRS) నాయకత్వం.. అందుకోసం భారీ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. మునుగోడు(Munugodu) ఉప ఎన్నికను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భావిస్తున్న సీఎం కేసీఆర్(CM KCR).. ఇందుకోసం నేతలందరికీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మునుగోడును 86 యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించబోతున్నారని తెలుస్తోంది. ఆ బాధ్యతల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు సైతం ఇందుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  మునుగోడు ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై దసరా రోజున జరగబోయే సర్వసభ్య సమావేశంలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు అప్పగించాలని కేసీఆర్ భావించారు. ప్రస్తుతం వాళ్లే మునుగోడు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

  అయితే బీజేపీ నేతలు మునుగోడు ఉప ఎన్నికపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో.. ఆ పార్టీ జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం ఉండటంతో.. టీఆర్ఎస్ కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను కేవలం జిల్లా మంత్రి, ఎమ్మల్యేలకు మాత్రమే ఇవ్వకుండా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ ఈ మేరకు బాధ్యతలు అప్పగించి.. కొందరు ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలను పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  Photos: షాకింగ్.. పోలీసులపై కోపంతో బైక్‌ను తగలబెట్టుకున్న వ్యక్తి.. హైదరాబాద్‌లోనే..

  KTR: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ ఎవరి మధ్య.. కేటీఆర్ ట్వీట్.. గతంలో అలా ఉండేదంటూ..

  ఇక ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించింది టీఆర్ఎస్. దానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి కేసీఆర్ హాజరయ్యే విధంగా మరో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మునుగోడు విషయంలో టీఆర్ఎస్ ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు