Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR TO FACE MUNUGODU BY ELECTIONS AND FIGHT WITH BJP WITH A NEW SLOGAN AND STRATEGY AK

KCR| Munugodu: కేసీఆర్ ‘మునుగోడు’ నినాదం ఏంటి ?.. ఈసారి హుజూరాబాద్‌కు భిన్నంగా..

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

Telangana: మునుగోడు ఉప ఎన్నికల్లో నేరుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీ విధానాలను వాటి ద్వారా రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే దానిపై కేసీఆర్ ప్రజలకు వివరించబోతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారబోతోంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా వారే బలమైన శక్తిగా ఉండబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రజల్లోనూ ఇదే రకమైన భావన ఉండటంతో.. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్‌లో జరగబోయే సభలో అమిత్ షా(Amit Shah) సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. అయితే అంతకంటే ఒక రోజు ముందుగానే మునుగోడు (Munugodu) నియోజకవర్గంలో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ (KCR)  రాబోతున్నారు. సీఎం కేసీఆర్ మునుగోడులో జరగబోయే సభకు రాబోతున్నారంటేనే.. టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోందనే సంకేతాలు రాజకీయవర్గాల్లోకి స్పష్టంగా వెళ్లాయి.

    బీజేపీ సభ కంటే ముందే ఒక రోజు ముందు టీఆర్ఎస్ సభ జరగబోతుండటంతో.. సీఎం కేసీఆర్ అక్కడ ఎలాంట ప్రకటన చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సభలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నా.. కేసీఆర్ మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపుతున్నారన్నది పొలిటికల్ టాక్. ఈ విషయంలో కేసీఆర్ మరో ఆలోచన చేయడం లేదనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు భిన్నంగా టీఆర్ఎస్ మునుగోడులో వ్యహరించబోతోందనే వాదన వినిపిస్తోంది.



    హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ పేరు ఎత్తకుండా కేసీఆర్ సభలు సాగాయి. అక్కడ ఆయన ఎన్నికల ప్రచారం అంతా పరోక్షంగానే సాగింది. కానీ మునుగోడులో మాత్రం కేసీఆర్ రాజకీయం వేరుగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి ఆయన నేరుగా బీజేపీని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉందని సమాచారం. పరోక్షంగా రాజకీయం చేయడం ద్వారానే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే భావనలో ఉన్న కేసీఆర్.. మునుగోడులో అలాంటి పరిస్థితి రావొద్దనే ఉద్దేశ్యంతో ఉన్నారని తెలుస్తోంది.

    Munugodu| Congress: ‘మునుగోడు’ మండలాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లు వీరే.. కీలక బాధ్యతలు

    Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్.. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు..

    అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో నేరుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీ విధానాలను వాటి ద్వారా రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే దానిపై కేసీఆర్ ప్రజలకు వివరించబోతున్నట్టు సమాచారం. అందుకే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ ప్రత్యేకమైన నినాదంతో ముందుకు సాగబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ హుజూరాబాద్‌కు భిన్నంగా ముందుకు వెళతారనే చర్చ జోరుగా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు