హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Munugodu: కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా ?.. అసలు కారణం ఏంటి ?

KCR| Munugodu: కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా ?.. అసలు కారణం ఏంటి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR| Munugodu: మునుగోడు సభలో టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన ఉంటుందని ఎదురుచూసిన ఆ పార్టీ శ్రేణులకు నిరాశ ఎదురుకావడంతో పాటు ఉత్కంఠ కూడా పెరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు టీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి బీజేపీపై పైచేయి సాధించి తెలంగాణ రాజకీయాల్లో తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే స్వయంగా సీఎం కేసీఆర్(KCR) ముందుగానే రంగంలోకి దిగి మునుగోడు(Munugodu) బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం ప్రభుత్వం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌కు(TRS) పట్టం కట్టాలని సూచించారు. అయితే మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం జరిగినా.. చివరకు అలాంటి ప్రకటన లేకుండానే ఆ సభ ముగిసింది.


  మునుగోడు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారని.. ఆయన పేరును మునుగోడు సభలోనే ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వద్దని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు అధినాయకత్వానికి సూచించారు. ఈ విషయంలో గట్టిగానే తమ వాదన వినిపించారు.  కానీ అభ్యర్థి ఎవరనే విషయాన్ని తమకు వదిలేయాలని టీఆర్ఎస్ నాయకత్వం స్థానిక నాయకత్వానికి సూచించింది. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే కేసీఆర్ అనుకూలంగా ఉన్నారనే చర్చ మొదలైంది. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇందుకు కారణం ఏంటనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మునుగోడు అభ్యర్థి విషయంలో కేసీఆర్ రెండు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారని.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ మునుగోడు అభ్యర్థి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


  BJP|Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ  Crime news : భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్ .. 7సార్లు ప్రయత్నం చేసి సక్సైస్ అయింది ..ఎందుకు చేసిందంటే


  అయితే అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టగా పేరున్న సీఎం కేసీఆర్.. మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అలాంటి ధోరణిని చూపిస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అక్కడ టీఆర్ఎస్ తరపున ఎవరు బరిలోకి దిగితే బాగుంటుందనే దానిపై టీఆర్ఎస్ అధినేత పలు సర్వేలు చేయిస్తున్నారని.. అవి పూర్తయిన తరువాత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మునుగోడు సభలో టీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన ఉంటుందని ఎదురుచూసిన ఆ పార్టీ శ్రేణులకు నిరాశ ఎదురుకావడంతో పాటు ఉత్కంఠ కూడా పెరిగింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు