Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR SAYS HE WILL GIVE ADVICE TO BJP WHICH IS TOPPLING GOVERNMENTS IN UNDEMOCRATIC METHOD SNR

KCR| BJP : దేశంలో బీజేపీ వికృత రాజకీయ క్రీడను కొనసాగిస్తోంది,బుద్ధి చెప్పాల్సిన టైమొచ్చింది : కేసీఆర్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

KCR | BJP: తెలంగాణలో టీఆర్ఎస్‌ని గద్దె దింపుతామని శపథం చేసిన బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. బీజేపీ ఆడుతున్న రాజకీయ వికృతకీడ తెలంగాణలో నడవదన్నారు. 8ఏళ్ల పాలనలో సమర్ధవంతమైన పాలన అందించలేక ఇతర పార్టీలను దెబ్బ తీయడమే పనిగా పెట్టుకున్నారని ..అలాంటి బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. మహరాష్ట్ర(Maharashtra)లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ (KCR)ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్‌(TRS)ను ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)లు, కట్టప్పలు ఏమీ చేయలేరని హెచ్చరిస్తూనే బీజేపీ(BJP)కి కేంద్రంలో కూడా నూకలు చెల్లిపోయాయంటూ రివర్స్ అటాక్ చేశారు. విశ్వగురువుగా చెప్పుకునే మోదీ (MODI)బ్యాంకులను లూటీ చేసే దొంగలకు విష్ గురువుని అభివర్ణించారు కేసీఆర్.

Telangana Schools Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్ని రోజులంటే?


బెదిరే ప్రసక్తే లేదు..
కేంద్రం ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని స్పష్టంగా చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం ఆదివారం తన ప్రెస్‌ మీట్‌లో అన్నీ రాష్ట్రాల్లో ఉన్నట్లుగా తెలంగాణలో ఉండదని బీజేపీని హెచ్చరించారు. కేసీఆర్‌ అనే వ్యక్తి ఫైటర్ అని ఎవరికి, ఎలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. ఒకటి రెండు కేసులు పెడితే కోర్టుల ద్వారా కొట్లాడతాం తప్ప వెనకడుగు వేయమన్నారు. అంతే కాదు నిజంగా మోదీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేను తీసుకురావాలని సవాల్ విసిరారు. తనకు మనీ లాండరింగ్ లేదన్న కేసీఆర్ మాతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్లేనన్నారు. నువ్వు గోక్కున్నా లేకపోయినా నేను మాత్రం నీతో గోక్కుంటానంటూ డైరెక్ట్ బీజేపీ హైకమాండ్‌ని టార్గెట్‌ చేసి తన మార్క్ పంచులు పేల్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.

నాతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లే..
ఆదివారం పాత్రికేయమిత్రులు, మీడియా ప్రతినిధుల సమావేశంలో దేశంలో బీజేపీ పాలనపై.. ఆపార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ లాంటి పార్టీలు దేశ ప్రగతికి గొడ్డలి పెట్టుతో సమానమన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఆర్ధికవృద్ధి రేటుతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శూన్యమన్నారు. కేవలం ఈడీ, ఐటీ వంటి వాటిని అడ్డుపెట్టుకొని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతూ ప్రజాస్వామ్య హంతకులుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ బాస్. ముఖ్యంగా అవినీతిపరులను కాపాడుతోంది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. బ్యాంకులకు లక్షల కోట్లు తీసుకొని లండన్‌, విదేశాల్లో తలదాచుకున్న వాళ్లలో ఒక్కరిని కూడా దేశానికి రప్పించలేకపోవడం చూస్తుంటే వాళ్లు దోచుకున్న దాంట్లో ప్రధాని మోదీకి వాటా ఉందని ఆరోపించారు కేసీఆర్.


వైఫల్యాల ఫలితమే..
దేశంలో నిరుద్యోగ సమస్య, ఉపాధి కరువు కావడానికి బీజేపీ మతిలేని నిర్ణయాలేనని మండిపడ్డారు. బీజేపీ గొప్పగా చెప్పుకున్న మేకిన్‌ ఇండియా పథకం అట్టర్‌ ప్లాప్ అయిందని మోదీ విమర్శించారు. దీపావళి టపాసులు, వినాయకచవితి విగ్రహాలు, గాలిపటాల మాంజాలు, చివరకు జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం చూస్తుంటే మోదీ సమర్ధత, చేతకాని తనం దేశ ప్రజలకు గుర్తించాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.

వికృత రాజకీయ క్రీడ..
బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులను బెదిరిస్తూ ..బ్లాక్ మెయిల్ చేస్తూ ఈడీ , ఐటీ నోటీసుల పేరుతో వేధించి వాళ్లకు చెందిన పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లను గుంజుకున్న ఘనత బీజేపీ పార్టీదన్నారు. అంతే కాదు పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలుగా ఉన్నవాళ్లను నోటీసులతో బెదిరించి బీజేపీలో చేరగానే వాళ్లను నీతిమంతులుగా మార్చేస్తూ విక్తృత రాజకీయ క్రీడను కొనసాగిస్తోందని బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై వీడియో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు కేసీఆర్. ఒక్కచోట ఏపీలో టీడీపీకి చెందిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి, నారాణయ్‌ రాణె, అసోంకి చెందిన హిమంత్‌ బిశ్వాస్, జ్యోతిరాధిత్య సింధియా, ముకుల్‌రాయ్‌తో పాటు తెలంగాణకు చెందిన ఈటల రాజేందర్‌ వంటి వాళ్లను పార్టీ కండువాలు కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా చూపిస్తున్నారని విమర్శించారు కేసీఆర్.

ఇప్పటికైనా ప్రజలు మేల్కొవాలి ..
దేశ ప్రజలు ఇప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని బీజేపీ పాలకులు చేస్తున్న దోపిడీ, అసమర్ధ పాలనకు చరమగీతం పాడకపోతే దేశానికి పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. యువత, విద్యావంతులు, మేధావులు బీజేపీ వైఫల్యాలను గుర్తించాలని ..వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి అలాంటి వ్యక్తులకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకుండా చేయాలని కోరారు కేసీఆర్.

Telangana| KCR : దేశ ఆర్ధిక పతనానికి మోదీనే కారణం .. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించుతాం: కేసీఆర్


Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, CM KCR, Telangana Politics

తదుపరి వార్తలు