తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయం గురించి ధ్వజమెత్తారు. బీజేపీ(BJP) చెప్పినట్లుగా వ్యవసాయ విద్యుత్ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టలేదన్న కోపమే కాదు ప్రతీ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ(Telangana)కు చెందాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తోందన్నారు. దేశానికి నరేంద్ర మోదీ(Narendra Modi)లాంటి అసమర్ధ ప్రధాని కావడం మన ఖర్మ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మోదీనే మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని(Fascist prime minister) అంటూ తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఏపీ సీఎం జగన్(Jagan)చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారిపోయి ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు.
ఎందుకీ వివక్ష..
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రధాని మోదీని, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో పని లేకుండా హుకుం కేంద్రం జారీ చేస్తుంటే తెలంగాణ వాటిని పాటించదన్నారు. ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. ఏపీ సీఎం ప్రధాని మొదటి మీటింగ్‌లోనే మోదీ జగన్ చేతిలో కీలు బొమ్మగా మారడం దురదృష్టమన్నారు. వాస్తవంగా ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి కానప్పటికి శాసనసభలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రెఫర్ చేయకుండా కర్కషంగా ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వేరు చేయడం చూస్తుంటే ప్రధాని మోదీ లాంటి ఫాసిస్ట్ ప్రధాని బహుశా దేశంలోనే మరొకరు ఉండరని చెప్పారు.
Live: Hon’ble CM Sri KCR speaking in Legislative Assembly https://t.co/6xgoTekdi3
— Telangana CMO (@TelanganaCMO) September 12, 2022
కీలుబొమ్మగా మారి..
అంతే కాదు ఏపీకి అనుకూలంగా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. ఏపీ నుంచి ఇప్పటికి తెలంగాణకు 17వేల 828కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కృష్ణపట్నంలో కూడా తెలంగాణ పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఏపీ తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిల గురించి పట్టించుకోకుండా వాళ్లకు చెల్లించాల్సిన మూడు వేల కోట్లకు 18శాతం వడ్డీతో 60వేల రూపాయలను నెల రోజుల్లో కట్టాల్సిందే కేంద్రం నోటీసులు పంపడం ఏమిటని ప్రశ్నించారు.అసెంబ్లీలో తాను చెప్పిన మాట అబ్ధమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శపథం చేశారు కేసీఆర్.
మహామహులే నిలబడలేదు ..
మహాత్ముడు పుట్టిన గడ్డపై మరుగుజ్జులు మాటలను తాము లెక్క చేయమన్నారు. దేశంలో ఇలాగే నియంతలా పాలించిన హిట్లర్, ముస్సోలిని వంటి వాళ్లు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని ...బీజేపీ కూడా ఏదో ఒక రోజు ఇంటికి పోవాల్సిందేనన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉంటామని బీజేపీ నేతలు కలలు కనవద్దని ఇంకా రెండేళ్లే సమయం ఉందని సూచించారు కేసీఆర్. రాష్ట్రాల గొంతు నొక్కి ..ప్రభుత్వాలను కూల్చేయాలన్నదే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వాళ్ల ఆటలు సాగని అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో బీజేపీ వైఖరీ, కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవలంభిస్తున్న విధానాల్ని తీవ్రంగా తప్పుపడుతూ ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Narendra modi, Telangana Politics