Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR SAID THAT BJP GOVERNMENT SHOULD CHANGE AT THE CENTER MODI IS BLOCKING THE DEVELOPMENT AND INCOME OF THE STATES SNR

Telangana| KCR : దేశ ఆర్ధిక పతనానికి మోదీనే కారణం .. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించుతాం: కేసీఆర్

(బీజేపీపై కేసీఆర్ ఫైర్ )

(బీజేపీపై కేసీఆర్ ఫైర్ )

Telangana| KCR: ప్రధాని మోదీ అసమర్ధ పాలనతో దేశం అన్నీ రంగాల్లో పతనమవుతోందన్నారు తెలంగాణ సీఎం. అనాలోచిత, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాల పురోగతిని కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశ ఆర్ధిక ప్రగతిని పతనం చేసిన మోదీ తెలంగాణలో ఎలా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగా కేంద్రంలో బీజేపీ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్.

ఇంకా చదవండి ...
దేశంలో అన్నీ రంగాలు పతనం కావడానికి బీజేపీ(bjp) ప్రభుత్వమే కారణమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అలాంటి బీజేపీ నాయకులు హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చి టీఆర్ఎస్‌ పాలనను విమర్శించడాన్ని సీఎం కేసీఆర్‌(kcr) తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్రంలో ప్రధాని మోదీ(Modi) అసమర్ధ పాలన వల్లే దేశం ఆర్ధికంగా, అభివృద్ధిలోనూ చితికిపోయిందన్నారు. దేశ రాజధానిలో నీళ్లు, కరెంట్ ఇవ్వలేని బీజేపీ పాలనకు తెలంగాణకు వచ్చి డబుల్ ఇంజన్ సర్కారు కావాలనడం సిగ్గుచేటన్నారు. జీడీపీ, పర్‌ క్యాప్టా ఇన్‌కమ్‌లో కూడా తెలంగాణ కేంద్రం కంటే డబుల్‌ స్పీడుతో ఉందన్నారు.

తెలివి తక్కువ నిర్ణయాలు..
దేశాన్ని పాలించిన ప్రధానులు ఎంతో మంది ఉన్నారని.. ఎవరూ నరేంద్ర మోదీ అంతటి దౌర్భాగ్య పాలన అందించలేదన్నారు కేసీఆర్. కేవలం మోదీ పవర్ పాలసీల వల్లే దేశ రూపాయి పతనం దగ్గర నుంచి పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు కేసీఆర్. కేవలం ఇదంతా మోదీ చేతకాని తనం, దరిద్రమేనని విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్‌కు వచ్చి కారు కూతలు కుశారంటూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం. రైతుబంధు, రైతుభీమా, రైతులకు ఉచిత కరెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తుంటే వాటిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్.బీజేపీని కేంద్రంలో గద్దె దించి తీరుతాం..
దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉంచుకొని దేశ రాజధానిలో తాగేందుకు నీళ్లివ్వడం చేతకావడం లేదని బీజేపీని ఘాటుగా విమర్శించారు తెలంగాణ సీఎం. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ అనారోగ్య, అప్రజాస్వామిక విధానాల కారణంగనే ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, దేశ జీడీపీ, పర్ క్యాప్టా ఇన్‌కమ్‌ పడిపోయిందన్నారు కేసీఆర్. కేంద్రంలో ఇలాంటి దద్దమ్మ ప్రభుత్వం ఉంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఎంత పరిగెత్తినా ప్రయోజనం ఉండదన్నారు. అందుకే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చెప్పినట్లుగా డబుల్ ఇంజిన్‌ సర్కారు ఉండాలన్నారు. అందుకే చేతకాని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించి ..సమర్ధవంతమైన టీఆర్ఎస్‌ లాంటి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు కేసీఆర్.

Hyderabad Police Rain Alert: అత్యవసరమైతేనే బయటకు రండి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన.. ఇంకా ఏమన్నారంటే?


పతనం మొదలైనట్లే ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ నాయకులకు దురహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. కళ్లు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని అందుకే బీజేపీ సమయం దగ్గర పడిందన్నారు. ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు కేసీఆర్. అందుకే టీఆర్ఎస్ కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు పోవాలి ...బీజేపీ రహిత ప్రభుత్వం రావాలని సూచించారు తెలంగాణ సీఎం. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ పాలన వచ్చిందని..కాని ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

మా ప్రభుత్వాన్ని పడగొట్టడం మీవల్ల కాదు..
త్రీ ఫోర్త్ మెజారిటీ కలిగిన టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ ఏం చేయలేదన్నారు సీఎం కేసీఆర్. ఏక్‌నాథ్‌ షిండే, కట్టప్పలు ఎంత మంది వచ్చినా బీజేపీ పతనం తప్ప టీఆర్ఎస్‌కు కలిగే నష్టం ఏమి ఉండదన్నారు. బీజేపీ అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల మహరాష్ట్రలో 20శాతం కరెంట్ ఛార్జీలు పెరిగాయన్నారు. అందుకే ప్రజలకు పరిగెత్తే గుర్రాలను కోరుకుంటారు తప్ప పనికిరాని బీజేపీ లాంటి దద్దమ్మ పార్టీలను, ప్రభుత్వాలను కోరుకోరంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమని అడిగితే కేంద్రంమంత్రి పియూష్‌ గోయల్‌ రైతులను నూకలు తినమన్నారని ఆయన గోయల్ కాదని గోల్‌మాల్ అని విమర్శించారు.

Mulugu: భారీ వర్షాలతో మునిగిపోతున్న ములుగు జిల్లా .. ఏజెన్సీ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు


Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana Politics

తదుపరి వార్తలు