హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ముందస్తు ఎన్నికలు లేవంటూనే.. పరిస్థితి అలా ఉందన్న కేసీఆర్.. 25 రోజుల తరువాత రిపోర్ట్..

KCR: ముందస్తు ఎన్నికలు లేవంటూనే.. పరిస్థితి అలా ఉందన్న కేసీఆర్.. 25 రోజుల తరువాత రిపోర్ట్..

Telangana Politics: గతంలో తాము ఓ ప్రత్యేకమైన కారణంతో ముందస్తు ఎన్నికలు వెళ్లామని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Telangana Politics: గతంలో తాము ఓ ప్రత్యేకమైన కారణంతో ముందస్తు ఎన్నికలు వెళ్లామని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Telangana Politics: గతంలో తాము ఓ ప్రత్యేకమైన కారణంతో ముందస్తు ఎన్నికలు వెళ్లామని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

  తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. కేసీఆర్ మరోసారి అలాంటి నిర్ణయం తీసుకుంటే.. తాము కూడా ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి విపక్ష బీజేపీ, కాంగ్రెస్. అయితే తాము మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని గతంలో పలుసార్లు క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు ఏ మాత్రం లేదని వివరించారు. దీనిపై వస్తున్న అంశాలన్నీ ఊహాగానాలే అని తోసిపుచ్చారు.

  గతంలో తాము ఓ ప్రత్యేకమైన కారణంతో ముందస్తు ఎన్నికలు వెళ్లామని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఆలోచన ఎవరూ పెట్టుకోవద్దని సూచించారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఎట్టిపరిస్థితుల్లోనూ తమకు లేదన్న కేసీఆర్.. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందన్న సర్వేలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల మూడు సంస్థలు రాష్ట్రంలోని 30 స్థానాల్లో సర్వేలు చేస్తే.. అందులో 29 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చిందని కేసీఆర్ తెలిపారు.

  ఓడిపోయే ఒక్క స్థానం కూడా స్వల్ప తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని రిపోర్టులో తేలిందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన రాబోయే ఎన్నికల్లో తాము 95 నుంచి 105 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. మరో 25 రోజుల్లో తాము మరో సర్వే అంచనాలు కూడా వివరిస్తామని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు.

  జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించిన రేవంత్‌రెడ్డి

  Telangana: కేంద్రం యాసంగి ధాన్యం కొనేవరకు పోరాటం.. తగ్గేదేలే అన్న సీఎం కేసీఆర్

  అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లబోమని ఎన్నిసార్లు చెప్పినా.. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇదే అంశంపై ఆయన పలువురు పార్టీ నేతలతోనూ చర్చిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా లేక మిగిలిన కాలానికి తమ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమా ? అనే అంశంపై సీఎం కేసీఆర్ విస్తృతస్థాయిలో సమాలోచనలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోనో లేక వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు