హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR Bandi Sanjay: వడ్లు కొంటారా లేదా చెప్పండి.. బండి సంజయ్‌కి కేసీఆర్ సూటి ప్రశ్న

KCR Bandi Sanjay: వడ్లు కొంటారా లేదా చెప్పండి.. బండి సంజయ్‌కి కేసీఆర్ సూటి ప్రశ్న

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: తెలంగాణలో 66 లక్షల ఎకరాల్లో వరి పండిందని.. బండి సంజయ్ అడిగినట్టు ఎక్కడ వరి పండిందో చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు సిద్ధం చేసి పెడతామని అన్నారు. ఎంత వరి పడింతే అంత కొంటామని చెప్పడానికి బండి సంజయ్‌కు ధైర్యం ఉందా ? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

కేంద్రం తెలంగాణలో పండించిన వడ్లు కొంటుందో ? లేదో ? సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు. వడ్లు కొంటారో ? లేదో ? చెప్పకుండా అనవసర విషయాలపై బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు మీద తప్ప.. మిగతా వాటిపై మాట్లాడాలని కేంద్రం నుంచి బండి సంజయ్‌కు ఆదేశాలు వచ్చాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల్లో వరి పండిందని.. బండి సంజయ్ అడిగినట్టు ఎక్కడ వరి పండిందో చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు సిద్ధం చేసి పెడతామని అన్నారు. ఎంత వరి పడింతే అంత కొంటామని చెప్పడానికి బండి సంజయ్‌కు ధైర్యం ఉందా ? అని కేసీఆర్ ప్రశ్నించారు.

బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్రవేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వారి పార్టీకి చెందిన వాళ్లే ఆ పార్టీకి తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు మద్దతు ఇచ్చినప్పుడు తాము దేశద్రోహులు కాదా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా తాాము దేశద్రోహులు కాలేదా ? అని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు అంటూ బీజేపీ ముద్ర వేస్తోందని.. బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? అని ప్రవ్నించారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుందని... ఒకటి దేశద్రోహులు.. రెండు అర్బన్ నక్సల్స్.. అని విమర్శించారు.

టీఆర్ఎస్‌‌ను రెండుసార్లు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాారని సీఎం కేసీఆర్ అన్నారు. తాను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పానని.. కానీ పరిస్థితులను బట్టి అలా చేయలేదని కేసీఆర్ అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మరింత మెజార్టీతో గెలిచిందని.. ఈ విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా సమర్థించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాము ఎన్నో ఎన్నికల్లో గెలిచామని.. ఒకటి రెండు ఎన్నికల్లో గెలవగానే బీజేపీ ఎగిరెగిరిపడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో ఇదే బీజేపీ.. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో.. బండి సంజయ్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు.


ఈటల రాజేందర్ నెక్ట్స్ టార్గెట్ అదేనా ?.. వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ?

Revanth Reddy: హుజూరాబాద్‌ విషయంలో రేవంత్‌రెడ్డి ఈ లాజిక్ మిస్సయ్యారా ?

కేంద్రంతో ఘర్షణకు ఎందుకు అని ఇంతకాలం సర్దుకపోయామని.. కానీ ఇకపై ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు తీసుకొచ్చిన తమ ప్రభుత్వం.. రైతులు వడ్ల పండించవద్దని చెబుతుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. కేంద్రం, బీజేపీ నేతలు నక్కజిత్తులా వేషాలు వేస్తున్నారని మండిపడ్డాారు. కేంద్రం,బీజేపీ ద్వందవైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని రైతులకు సూచించారు.

First published:

Tags: Bandi sanjay, CM KCR, Telangana

ఉత్తమ కథలు