హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ?

KCR: ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ?

కేసీఆర్

కేసీఆర్

KCR| Left Parites: టీఆర్ఎస్ కీలక సమావేశంలో పొత్తుల గురించి కేసీఆర్ ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్(KCR).. ఆ సమావేశంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేస్తూనే.. ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉందంటూ వారికి గుర్తు చేశారు. ఈ కాలంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఏం చేయాలనే దానిపై స్పష్టమైన దిశానిర్ధేశం చేశారు. బీజేపీని(BJP) ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంతో పాటు మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంతటి కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ ఓ కీలకమైన అంశం గురించి పెద్దగా స్పష్టత ఇవ్వలేదనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS) విజయంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాయనే టాక్ ఉంది.

టీఆర్ఎస్ స్వల్ప మెజార్టీతో గెలిచిన మునుగోడులో వామపక్షాలు ఎంతగానో ప్రభావితం చేశాయని.. ఒకవేళ లెఫ్ట్ పార్టీలతో గులాబీ దళం పొత్తు లేకపోయి ఉంటే.. అధికార పార్టీకి మరోసారి భంగపాటు ఎదురయ్యే అవకాశం ఉండేదని చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. విపక్ష బీజేపీ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసింది. వామపక్షాల పొత్తు కారణంగా టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిందని ధ్వజమెత్తారు. బీజేపీ విమర్శలు ఎలా ఉన్నా.. మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల బంధం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

పలవురు వామపక్షాల ముఖ్యనేతలు.. ఇప్పటికే పలు సీట్లపై అప్పుడే ఫోకస్ చేయడం.. ఆయా స్థానాల్లో ఎర్రజెండా ఎగురుతుందని చెప్పడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలేరుపై తమ్మినేని, కొత్తగూడెంపై కూనంనేని, హుస్నాబాద్‌పై చాడ వెంకట్ రెడ్డి గురి పెట్టారనే వార్తలు మొదలయ్యాయి. వీరంతా పోటీ చేసేందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Siricilla: ఇది కేటీఆర్ ఇజ్జత్ కా సవాల్.. సిరిసిల్లకు ఆ సౌకర్యం నిల్..!

Mulugu: 80ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డులేదు.. జనం ఇబ్బందులు ఇంతింతకాదయా..!

అయితే టీఆర్ఎస్ కీలక సమావేశంలో పొత్తుల గురించి కేసీఆర్ ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది. కొన్ని అంశాల్లో వామపక్షాలు మనతో కలిసి వస్తాయనే విషయాన్ని మాత్రం కేసీఆర్ చెప్పారని.. పొత్తుల గురించి ఆయన ఏమీ చెప్పకపోవడం పార్టీ నేతల్లో కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా చేస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ విషయాలపై ఎన్నికల సమయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు