Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR MAY TARGET BJP ON FREE SCHEMES IN MUNUGODU BY ELECTIONS AK

KCR: కేసీఆర్ 'మునుగోడు' ఫ్లాన్ రెడీ.. ఆ నినాదంతోనే బీజేపీకి చెక్ చెప్పాలని నిర్ణయం ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR Vs BJP: ఓ వైపు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూనే.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలను, ముఖ్యంగా ఉచిత పథకాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారనే విషయం.. ఇటీవల మునుగోడుకు(Munugodu) సంబంధించిన సమీక్షలు, అక్కడి నేతలతో ఆయన జరిపిన సమావేశాలను బట్టి అర్థమవుతోంది. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ(BJP) విజయం సాధించడంతో.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు కచ్చితంగా కళ్లెం వేయాలనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారు. అయితే హుజూరాబాద్‌కు భిన్నంగా ఇక్కడ ప్రచారం చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్(KCR).. ఇందుకు సంబంధించిన నినాదాన్ని కూడా సిద్ధం చేశారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. నిన్న వికారాబాద్‌లో కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..అనంతరం జరిగిన సమావేశంలో బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

    ఇందులో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉచిత పథకాలు అమలు చేయొద్దని అంటోందని.. పెన్షన్లు, రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి వాటికి ఆ పార్టీ వ్యతిరేకమని విమర్శించారు. అలాంటి పార్టీ తెలంగాణకు అవసరమా ? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే రకమైన నినాదంతో ప్రజల ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.



    ఉప ఎన్నికలు జరగబోయే మునుగోడు ప్రాంతంలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలే ఉంటాయి. అక్కడి ప్రజలు పెన్షన్లు, రైతుబంధు, ఉచిత విద్యుత్ కారణంగా ఎక్కువగా లబ్ది పొందుతున్నారని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం బీజేపీ ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్ సభలో ముందస్తుగానే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ఉచిత పథకాల రద్దు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే.. ప్రజలు కచ్చితంగా టీఆర్ఎస్ వైపు నిలుస్తారనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని సమాచారం.

    Congress: కాంగ్రెస్​లో మరో కల్లోలం.. ఠాగూర్​పై మర్రి శశిధర్​ రెడ్డి సంచలన ఆరోపణలు

    KCR KIT: కేసీఆర్ కిట్‌ నుంచి ఆ వస్తువును తీసేస్తారా? క్యాన్సర్ కారకాలున్నాయని వివాదం

    ఓ వైపు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూనే.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలను, ముఖ్యంగా ఉచిత పథకాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మునుగోడులో జరగబోయే సభలోనూ సీఎం కేసీఆర్ ఈ అంశాలనే ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బీజేపీని టార్గెట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే నమ్ముకుంటున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Munugodu By Election, Telangana

    తదుపరి వార్తలు