హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Tamilisai: గవర్నర్ విషయంలో కేసీఆర్ సరికొత్త వ్యూహం.. వారి తరహాలోనే..

KCR| Tamilisai: గవర్నర్ విషయంలో కేసీఆర్ సరికొత్త వ్యూహం.. వారి తరహాలోనే..

Telangana: రాజ్యాంగపరంగా ఇబ్బందులు రాకుండానే.. తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్న గవర్నర్‌కు చెక్ పెట్టడం ఎలాగనే అంశంపై కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.

  కొద్దిరోజుల క్రితం వరకు బయటపడకుండా సాగిన గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఇప్పుడు పూర్తిగా బహిర్గతమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో.. ప్రభుత్వానికి, గవర్నర్‌ తమిళిసైకు మధ్య ఉన్న గ్యాప్ బట్టబయలైంది. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ బాహాటంగా చేసిన కామెంట్స్‌తో.. ఇకపై రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి గవర్నర్ కారణంగా తమకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బయటపెడుతుంటారు. బెంగాల్‌లో సీఎం మమత, ఆమె మంత్రివర్గ సహచరులు గవర్నర్‌పై విమర్శలు చేస్తుంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు సీన్ ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వం రాజ్‌భవన్‌ను పట్టించుకోవడం లేదని, గవర్నర్‌కు కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ ఏకంగా ఢిల్లీలోనే మీడియాకు వివరించారు తమిళిసై.

  అయితే కేంద్రమే గవర్నర్‌తో ఇలా చేయిస్తోందనే భావనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాబోయే రోజుల్లో గవర్నర్‌తో ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తనను టార్గెట్ చేసిన వారిని, ఇబ్బందిపెట్టాలని చూసే వారిని టార్గెట్ చేయడంలో సీఎం కేసీఆర్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. కొన్ని విషయాల గురించి తాను మాట్లాడితే... దానిపై అనవసర చర్చ జరిగి విషయం పెద్దదిగా మారి అవతలి వారికి లాభం కలుగుతుందని కేసీఆర్ భావిస్తుంటారు.

  అందుకే కొందరి గురించి మీడియాలో ఎంత చర్చ జరిగినా.. కేసీఆర్ మాత్రం వాటి గురించి అస్సలు మాట్లాడరు. అలా చేయడం వల్ల వారికి మీడియాలోనూ, జనంలోనూ ప్రాధాన్యత తగ్గుతుందన్నది ఆయన వ్యూహం. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అమలు చేసే ఈ వ్యూహాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై విషయంలో అమలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  కొంతకాలంగా సీఎం కేసీఆర్ గవర్నర్ విషయంలో ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని.. సీఎం కేసీఆర్, ప్రభుత్వం తనను పట్టించుకోకపోవడం వల్లే గవర్నర్ తమిళిసై ఇలా మీడియాతో మాట్లాడవలసి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజ్యాంగపరంగా ఇబ్బందులు రాకుండానే.. తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్న గవర్నర్‌కు చెక్ పెట్టడం ఎలాగనే అంశంపై కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తమిళిసై విషయంలో కేసీఆర్ సర్కార్ భవిష్యత్తులో ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది చూడాలి.

  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు