Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR MAY FOLLOW AP CM YS JAGAN MOHAN REDDY FOOTSTEPS WILL RESHUFFLE CABINET AFTER UGADI AK

KCR| Telangana: జగన్ బాటలో కేసీఆర్.. త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. అదే జరిగితే.. ఆ ఆలోచన లేనట్టే ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడుతుండటంతో.. ఆయన బాటలోనే కేసీఆర్ కూడా వెళతారని.. తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన గులాబీ బాస్‌కు ఉందని తెలుస్తోంది.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. పరిపాలనపరంగానూ, రాజకీయంగానూ ఆయన నిర్ణయాలు ఎవరి అంచనాలకు అందవు. కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీతో తీవ్రంగా రాజకీయ పోరాటం సాగిస్తున్న కేసీఆర్ (KCR).. ఆ పార్టీపై పైచేయి సాధించేందుకు తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై కేంద్రంలోని బీజేపీని(Bjp) గట్టిగా టార్గెట్ చేయాలని డిసైడయ్యారు కేసీఆర్. ఇదిలా ఉంటే తనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పిన కేసీఆర్.. త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (Telangana Cabinet Reshuffle) చేపట్టేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది.

    సీఎం కేసీఆర్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడతారనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారా లేక కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడతారా ? అన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆయన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఐదుగురు లేదా ఆరుగురు మంత్రులను తప్పించి.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలనే యోచన సీఎం కేసీఆర్‌కు ఉన్నట్టు సమాచారం.

    ఉగాది తరువాత ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు మంత్రుల పనితీరు, వారిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానంలోకి మరొకరిని తీసుకోవడంతోపాటు కొందరిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    Konda Surekha| Telangana: డైలమాలో కొండా దంపతులు.. అదే అత్యంత ప్రాధాన్యమా ?.. సరికొత్త ప్లాన్

    రేవంత్ రెడ్డికి అండగా ముఖ్యనేత.. రాహుల్ గాంధీతో భేటీలోనూ.. అసమ్మతి నేతలకు చెక్.. అదే కారణమా ?

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడుతుండటంతో.. ఆయన బాటలోనే కేసీఆర్ కూడా వెళతారని.. తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన గులాబీ బాస్‌కు ఉందని తెలుస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన తరువాతే సీఎం కేసీఆర్ కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తే.. ఆయన ముందస్తు ఎన్నికల ఆలోచనను వాయిదా వేసుకున్నట్టే భావించాల్సి ఉంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు