హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Munugodu: బీజేపీతో పాటు సై అనేసిన కాంగ్రెస్.. ఇక అందరి దృష్టి కేసీఆర్ నిర్ణయం మీదే..

KCR| Munugodu: బీజేపీతో పాటు సై అనేసిన కాంగ్రెస్.. ఇక అందరి దృష్టి కేసీఆర్ నిర్ణయం మీదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRS| Munugodu: ఇక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఎప్పుడు ఖరారు చేస్తారో అనే అంశంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) .. స్వయంగా బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక బరిలో దిగబోతున్నారు. ఆయనకు పోటీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ బాగానే కసరత్తు చేశాయి. ఈ రెండు పార్టీల్లో ముందుగా ఎవరు తమ అభ్యర్థిని ప్రకటిస్తారో అనే చర్చ జరిగింది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్(CM KCR) మాత్రం ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మునుగోడు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ పేరును ప్రకటించే విషయంలో మాత్రం కేసీఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

  అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కంటే ముందే తమ నిర్ణయం ప్రకటించింది. నలుగురైగురు పేర్లను పరిశీలించి.. చివరకు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి అవకాశం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఎప్పుడు ఖరారు చేస్తారో అనే అంశంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజానికి కొద్దివారాల క్రితం మునుగోడులో జరిగిన సభలోనే ప్రభాకర్ రెడ్డిని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటిస్తారని అంతా భావించారు.

  కానీ కేసీఆర్ ఎందుకో ఆ పని చేయలేదు. దీంతో మునుగోడు అభ్యర్థి ఎవరనే విషయంలో ఆయన ఇంకా ఓ నిర్ణయానికి రాలేదేమో అనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాత కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ చేస్తారనే చర్చ కూడా జరిగింది. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కూడా రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇస్తే.. కేసీఆర్ కూడా రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరిగింది.

  Assam CM in Hyderabad: చిచ్చు రేపిన అస్సాం సీఎం రాక.. గణేశ్​ నిమజ్జనం వేళ హైదరాబాద్​లో ఉద్రిక్తత​

  Loan Apps: లోన్‌యాప్‌కు మరో యువకుడు బలి.. ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా సీరియస్

  అయితే మునుగోడులో బీసీ వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో.. కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇస్తారా లేక అంతా భావిస్తున్న విధంగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇక ఈ విషయంలో ఎక్కువ సమయం తీసుకునే అవకాశం లేదని.. కొద్దిరోజుల వ్యవధిలోనే టీఆర్ఎస్ అధినేత మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election, Trs

  ఉత్తమ కథలు