హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ క్లారిటీ.. టికెట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Politics: తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ క్లారిటీ.. టికెట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

CM KCR: సీఎం కేసీఆర్ నిజంగానే మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారా ? అనే చర్చ జోరందుకుంది. అయితే మరోసారి ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు.

  2018 తరహాలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు గతంలోనూ పార్టీ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వారికి తెలిపారు. అయితే ఆ తరువాత బీజేపీ తెలంగాణ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని చెప్పడంతో.. రాష్ట్రంలోనూ కొందరు ముందస్తు ఎన్నికలపై మాట్లాడటంతో.. సీఎం కేసీఆర్ నిజంగానే మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారా ? అనే చర్చ జోరందుకుంది. అయితే మరోసారి ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని వివరించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉండేదని.. ఇప్పుడు అలాంటి అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  ఎవరో కొందరు పిచ్చివాళ్లు ఈ అంశంపై చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికల భ్రమలో ఎవరూ ఉండాల్సిన పని లేదని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్రతిసారీ ఒకే వ్యూహంతో ముందుకు వెళ్లబోమని అన్నారు. అయితే ఈసారి కూడా ఓ అద్భుతమైన వ్యూహం ఉందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఓ 6 నెలల ముందుగానే అభ్యర్థులకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉందని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు రావొచ్చని కొంతకాలం నుంచి ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలు బలపడకముందే సీఎం కేసీఆర్ మరోసారి ఈ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేశారు.


  Also Read: KCR: ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేసీఆర్ లెక్కలేంటి ?.. బీజేపీకి షాక్ తగులుతుందా ?

  Also Read: Telangana Politics: అదే జరిగితే.. ఈటల రాజేందర్‌కు మరో షాక్ తగలనుందా..?

  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కచ్చితంగా ఉందని అన్నారు. అయితే ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పందించిన సీఎం కేసీఆర్.. అసలు ముందస్తు ముచ్చటే లేదని తేల్చి చెప్పారు. మరి.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఈ రకమైన ఊహాగానాలు పుట్టుకొస్తాయేమో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు