Home /News /telangana /

TS POLITICS TELANGANA CM KCR FIRES ON BJP PM MODI IN VIKARABAD DISTRICT HERE IS THE DETAILS AK

KCR: ప్రధాని మోదీది వేషం తప్ప ఏమీ లేదు.. తెలంగాణను గుంటనక్కల పాలు కానివొద్దన్న సీఎం కేసీఆర్

వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్

వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్

CM KCR: 8 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క మంచి పని చేశారా ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఎవరికి మేలు జరుగుతుందని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    పంద్రాగస్టు సందర్భంగా గంట సేపు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశానికి ఏం చేస్తామో చెప్పలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆయనది వేషం తప్ప మరొకటి కాదని అన్నారు. వికారాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్ (CM KCR).. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఒకప్పుడు తెలంగాణ(Telangana) ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చానని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్న వాళ్లు మనం ఇచ్చేది ఉచితాలు అని అంటున్నారని తెలిపారు.

    8 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ఒక్క మంచి పని చేశారా ? అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఎవరికి మేలు జరుగుతుందని అన్నారు. రాజకీయంగా చైతన్యం లేని సమాజంతో మోసపోతామని అన్నారు. రైతుల మెడ మీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని కేంద్రం చెబుతోందని కేసీఆర్ తెలిపారు. సంస్కరణల పేరుతో మన కడుపు కొట్టి పెద్ద పెద్దోళ్ల కడుపులు నింపుతారని కేసీఆర్ విమర్శించారు. ఈ రోజు గ్యాస్ ధర ఎంత ? పెట్రోల్ ధర ఎంత ? అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దంటున్న కేంద్రం.. పెద్ద పెద్దవాళ్లకు ఎన్‌పీఏ పేరుతో వేల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చంది ఈ బీజేపీనే అని ధ్వజమెత్తారు. కేంద్రం దద్దమ్మ పని కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆగిపోయిందని అన్నారు.



    తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు రూ. 2000 పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు ఇటీవల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ వస్తే ఇక్కడి భూములు ధరలు పడిపోతాయనే ప్రచారాన్ని పటాపంచలు చేశామని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు ఏపీలో ఒక్క ఎకరం భూమి కొనుగోలు చేసి తెలంగాణలో రెండు మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసేవాళ్లని.. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందని అన్నారు.

    Telangana : TRS ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆన్‌లైన్‌లో కట్నాలు వసూలు .. వైరల్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్

    Revanth Reddy : కాంగ్రెస్‌ను ఎవరూ వీడొద్దు .. లీడర్స్ , క్యాడర్‌ని రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో ఇదే

    తెలంగాణలోని సంక్షేమ పథకాలు అమలు చేయాలని పొరుగున ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలోని పలు గ్రామాల డిమాండ్ చేశారని.. లేకపోతే తమను తెలంగాణలో కలపాలని ఆందోళన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రైతాంగం పరిస్థితి మెరుగైందని.. రైతుబంధు, రైతు బీమా వంటివి రైతులకు అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతోందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    తదుపరి వార్తలు