హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Telangana: కేసీఆర్‌కు ముందు సరికొత్త సవాల్.. కాంగ్రెస్, బీజేపీ వెయిటింగ్..

KCR| Telangana: కేసీఆర్‌కు ముందు సరికొత్త సవాల్.. కాంగ్రెస్, బీజేపీ వెయిటింగ్..

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| TRS: అధికార బీజేపీ నిలిపే అభ్యర్థి లేదా విపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో టీఆర్ఎస్‌కు అనేక పరిమితులు ఉన్నాయి.

  రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగడంతో.. దేశంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ఎన్నికలకు ప్రజలకు నేరుగా సంబంధం లేకపోయినా.. రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం చూపించడానికి ఈ ఎన్నికలు దోహదం చేసే అవకాశం ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బరిలోకి దింపబోయే అభ్యర్థిని గెలిపించుకోవడం అధికార బీజేపీకి అంత కష్టమేమీ కాకపోయినా.. గతంలో రామ్‌నాథ్ కోవింద్‌ను గెలిపించుకున్న విధంగానే ఈసారి కూడా రాష్ట్రపతి అభ్యర్థిని(President Candidate) మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం పలు విపక్షాలను ఒప్పించాలని యోచిస్తోంది. ఈ బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్యనేతలకు అప్పగించింది.

  మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్(TRS) వైఖరి ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ నిలిపే అభ్యర్థి లేదా విపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో టీఆర్ఎస్‌కు అనేక పరిమితులు ఉన్నాయి. బీజేపి(BJP) నిలిపే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఏ మాత్రం సుముఖంగా లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఈ రెండు పార్టీలో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నాయి.

  ఇక కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సానుకూలంగా లేరు. మమత బెనర్జీ ఈ మేరకు చేస్తున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ కూడా భాగస్వామి కావడం ఆయనకు నచ్చడం లేదు. అందుకే ఆమె సారథ్యంలోని భేటీకి కూడా టీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ ఈ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరికి టార్గెట్‌గా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థికి టీఆర్ఎస్ అనుకూలంగా ఓటు వేస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినా.. లేక ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే కేసీఆర్ అండ్ టీమ్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించే అవకాశం లేకపోలేదు.

  Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వానలే వానలు.

  Telangana| BJP: బీజేపీకి ఈసారైనా ఆ లోటు తీరుతుందా ?.. మళ్లీ అలాగే జరుగుతుందా ?

  దీంతో అసలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో గులాబీ బాస్ ఏ రకమైన నిర్ణయంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా.. ఏదో ఒక పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కచ్చితంగా ఉంటుందని.. దానికి ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే అంశంపైనే టీఆర్ఎస్ ఎక్కువగా కసరత్తు చేస్తోందనే చర్చ సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, CM KCR, Congress, Telangana

  ఉత్తమ కథలు