కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) లోక్ సభ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR) తీవ్రంగా ఖండించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజుగా ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ(Narendra Modi) దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాక్యానించారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నదని... ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు తనపై లోక్ సభ అనర్హత వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశం కోసం గొంతువిప్పేందుకు తాను పోరాడతానని, ఈ క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందుకు కర్నాటకలో రాహుల్ మాట్లాడుతూ దొంగలందరికీ మోదీ ఇంటి పేర్లే ఎందుకు ఉంటాయని ప్రశ్నించడం దుమారం రేపింది. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేండ్లు లేదా అంతకుమించి జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెల్లడైన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు.
Governor Tamilisai: TSPSC పేపర్ లీక్..గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు..48 గంటల్లో..
Bandi Sanjay: "నాకు నమ్మకం లేదు..నేను రాను"..సిట్ కు బండి సంజయ్ లేఖ
జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేండ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వారు అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే వారిని తక్షణమే అనర్హులుగా పరిగణించాలని 2013లో సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మరోవైపు అనర్హత వేటును నిరోధించేందుకు దిగువ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాల్సిందిగా రాహుల్ అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారని కాంగ్రెస్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Rahul Gandhi, Telangana