హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: జాతీయ రాజకీయాల్లోకి వెళతాం.. ఢిల్లీ కోట బద్ధలు కొడతాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: జాతీయ రాజకీయాల్లోకి వెళతాం.. ఢిల్లీ కోట బద్ధలు కొడతాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)

CM KCR: అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజలు ఇచ్చిన శక్తి, దీవెనలతో తెలంగాణ సాధించుకున్నామని.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం కోసం కొట్లాడాల్సి వస్తే కొట్టాడతామని.. ఢిల్లీ కోటను బద్ధలు కొడతామని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషిస్తామని అన్నారు. సిద్ధిపేట ప్రజలు దీవించి పంపితే తెలంగాణ కోసం కొట్టాడి రాష్ట్రాన్ని సాధించానని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ దీవించి పంపితే దేశం కోసం కొట్టాడతానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ బెదిరింపులకు తెలంగాణలో భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. బీజేపీ వాళ్లు అనవసరంగా తమ జోలికి వస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. దేశంలోని మోదీ ప్రభుత్వం రైతులు, పేదల వెంటపడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం.. వారి పెట్టుబడి రెట్టింపు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతుల బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కోరుతోందని కేసీఆర్ అన్నారు. కేంద్రం ఏం చేసినా.. తాము ఆ పని చేయబోమని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు ప్రధాని మోదీ హయాంలోనే దేశం విడిచి పారిపోయారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని.. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్డం లేదని.. ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ దేశం నుంచి మోదీని తరిమేసి తమకు ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటామని అన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఉన్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ద‌ళిత బంధు కింద ఈ సంవ‌త్స‌రం 40 వేల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్నామ‌ని.. సంవ‌త్స‌రానికి రెండు మూడు ల‌క్ష‌ల కుటుంబాల‌కు రైతు బంధును అంద‌జేస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్య‌మం జ‌రిగేట‌ప్పుడే తాను తెలంగాణ వ‌స్తే బాగుప‌డ‌తామ‌ని.. ధ‌నిక రాష్ట్రం అవుతుంద‌ని చెప్పా అని గుర్తు చేశారు. ఇప్పుడు వంద‌కు వంద శాతం తాను చెప్పిన‌ట్టు జ‌రుగుతోందని అన్నారు. ద‌ళిత బంధు ద్వారా 10 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే కాదు.. మెడిక‌ల్ షాపుల ఓన‌ర్ల‌కు రిజ‌ర్వేష‌న్లు పెట్టామని తెలిపారు.


Telangana Politics: కాంగ్రెస్ ఎంపీకి కేసీఆర్ ప్రాధాన్యత.. వేరే కారణం ఏమైనా ఉందా ?

Telangana Politics: ఆ మాజీమంత్రి మాటలకు అర్థమేంటి ?.. కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారా ?

ఫ‌ర్టిలైజ‌ర్ షాపుల‌కు, ఆసుప‌త్రుల‌కు, ప్ర‌భుత్వ కాంట్రాక్ట్‌లో, బార్ షాపుల‌లో కూడా రిజ‌ర్వేష‌న్లు పెట్టామని కేసీఆర్ అన్నారు. ఇదివ‌ర‌కు బార్ షాపులు నిర్వ‌హించే ద‌ళితులు లేరని... కానీ.. నేడు ద‌ళితులు కూడా బార్ షాపులు నిర్వ‌హిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ముందే అన్ని సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. స‌మైక్య పాల‌కుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుప‌డుతోందని అన్నారు.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు