హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cabinet meeting: మంత్రులతో CM KCR అత్యవసర భేటీ.. సమావేశంపై అందరిలోనూ ఉత్కంఠ.. ముందస్తు ఎన్నికలపైనే చర్చలా?

Cabinet meeting: మంత్రులతో CM KCR అత్యవసర భేటీ.. సమావేశంపై అందరిలోనూ ఉత్కంఠ.. ముందస్తు ఎన్నికలపైనే చర్చలా?

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్న క్రమంలో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలా భేటీ కావడం చర్చలకు దారితీసింది.

  తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర భేటీ (Emergency meeting with ministers) ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ (Erravalli Farmhouse)లో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం (Pre elections) జోరుగా ఉన్న క్రమంలో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలా భేటీ కావడం చర్చలకు దారితీసింది. ముఖ్యమంత్రితో భేటీకి రావాలని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ (Erravalli Farmhouse) నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లినట్టుగా సమాచారం. దీంతో అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కేటీఆర్  ( KTR)​ అందుబాటులో లేకపోవడంతో ఆయన సమావేశానికి రాలేకపోయారు.

  ఈ తెలంగాణ మంత్రి మండలి సమావేశంలో (Cabinet meeting) పాలనాపరమైన అంశాలపై మంత్రులు (Ministers), ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై కూడా చర్చించే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎస్ కూడా సీఎం కేసీఆర్‌ (CM KCr)తో భేటీకి హాజరుకావడంతో ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా..? అనే చర్చ సాగుతుంది.  మరోవైపు ఇటీవల కేసీఆర్‌కు.. ప్రశాంత్ కిషోర్ (PK) బృందం పలు అంశాలపై సర్వే రిపోర్ట్‌(Report)ను అందజేసిన సంగతి తెలిసిందే. వాటిపై కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  ఇటీవల బీజేపీ (BJP) తెలంగాణలో బాగా పాతుకుపోతోంది. తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ వెళుతోంది. కాగా, తమకు ప్రత్యర్థి అయిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే, గతంలోనే ముఖ్యమంత్రి పార్టీ క్యాడర్‌ను హెచ్చరించడం జరిగింది. కేంద్ర నిఘా సంస్థలు ఎక్షణానైనా దాడి చేయవచ్చు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐటీ రెయిడ్స్ జరిగిన కేఎన్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు పని చేస్తోంది. కేఎన్‌ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఫోకస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి.

  కీలక నిర్ణయం తీసుకొనే క్రమంలోనే..

  టీఆర్​ఎస్​ పార్టీ నేతలు (TRS Leaders) సైతం ఈ సమావేశం (Cabinet meeting) వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రులతో పాటుగా స్పీకర్ ..సీఎస్ సైతం హాజరు కావటంతో ప్రభుత్వ పరంగా- రాజకీయాలతో కూడిన నిర్ణయమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీని పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక, ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం కీలక నిర్ణయం తీసుకొనే క్రమంలోనే మంత్రులతో పాటుగా సీఎస్ ను సైం పిలిపించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో.. ఇంత అత్యవసరంగా తీసుకొనే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఈ ఉత్కంఠకు కారణమవుతోంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cabinet Meeting, CM KCR, Minister harishrao, TRS leaders

  ఉత్తమ కథలు