హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS Assets: ఇవీ టీఆర్ఎస్ ఆస్తులు, నిధులు లిస్ట్.. బయటపెట్టిన సీఎం కేసీఆర్

TRS Assets: ఇవీ టీఆర్ఎస్ ఆస్తులు, నిధులు లిస్ట్.. బయటపెట్టిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

TRS Assets Value: తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతామంటే నిధులు ఇస్తామని ఎంతోమంది ముందుకొచ్చారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

  తెలంగాణలో ఏడేళ్ల నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, ఆ పార్టీ దగ్గర ఉన్న నిధుల వివరాలు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో చివరగా మాట్లాడిన కేసీఆర్.. టీఆర్ఎస్ (TRS) సుసంపన్నమైన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిధుల కొరత లేదని తెలిపారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతామంటే నిధులు ఇస్తామని ఎంతోమంది ముందుకొచ్చారని కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ దగ్గర రూ. 865 కోట్ల నిధులు ఉన్నాయని.. వాటిపై ప్రతి నెల 3.84 కోట్ల వడ్డీ వస్తోందని అన్నారు. ఆ వడ్డీ డబ్బు కూడా రూ. 24 కోట్లు దాటిందని అన్నారు. వీటిని ఎంతో పారదర్శకంగా రెండు బ్యాంకుల్లో ఉంచామని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్ చేశామని తెలిపారు. ఇక టీఆర్ఎస్‌కు సంబంధించిన ఢిల్లీ, హైదరాబాద్, జిల్లా, కార్యాలయాల ఆస్తుల విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

  తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీపై (PM Narendra Modi)  ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. ఇలా అడగటానికి కనీసం సిగ్గుండాలి ? కదా అని దుయ్యబట్టారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లలో వీటి ధరలను ఎప్పుడూ పెంచలేదని కేసీఆర్ తెలిపారు. ధరలు పెంచేది వాళ్లు.. తగ్గించాల్సింది మేమా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగంలో అభివృద్ధి సాధించిందో వాళ్లు చెప్పగలరా ? విమర్శించారు. కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారని మండిపడ్డారు.

  ఏదైనా నిర్మించడం కష్టమని.. దాన్ని ధ్వంసం చేయడం చాలా సులువు అని కేసీఆర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని చెడగొడితే దేశం వందేళ్లు వెనక్కి వెళుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

  Political war: వేములవాడ అధికార పార్టీలో వర్గపోరు..పంతం నీదా నాదా

  KCR | TRS plenary: ఒక్కసారి కూడా బీజేపీ పేరెత్తని కేసీఆర్.. కారు గేరు మారిందా? పీకే వ్యూహమా?

  అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. దేశ రాజకీయాల్లో ఏ రకంగా మార్పు తీసుకురావాలనే దానిపై తనవంతు ప్రయత్నాలు చేస్తానని.. ఇందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని కేసీఆర్ చివరగా పార్టీ నేతలకు తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు