హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Congress: కాంగ్రెస్ భవిష్యత్తుపై కేసీఆర్ అంచనా.. మాజీ ఎంపీ మాటలతో తేలిపోయిందా ?

KCR| Congress: కాంగ్రెస్ భవిష్యత్తుపై కేసీఆర్ అంచనా.. మాజీ ఎంపీ మాటలతో తేలిపోయిందా ?

కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

KCR on Congress: ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో మిగిలాయి.

  దేశంలో బీజేపీ బలపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో దేశవ్యాప్తంగా ఒకప్పుడు బలమైన పార్టీగా అధికారం సాగించిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం కూడా బీజేపీ(BJP) బలోపేతానికి ఒక కారణం. కాంగ్రెస్ బలహీనపడటాన్ని ఎప్పటికప్పుడు అవకాశంగా మార్చుకుంటున్న బీజేపీ.. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపర్చేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్(Congress) పార్టీ మళ్లీ పుంజుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ రాత మారుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై మిగతా పార్టీల లెక్కలు భిన్నంగా ఉన్నాయి.

  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతోందని.. ఆ పార్టీ నష్టపోయిన చోట తాము లాభపడేందుకు పలు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ స్థానాన్ని సొంతం చేసుకున్న ఆప్.. మిగతా రాష్ట్రాల్లోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదనే లెక్కల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (BJP) కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన తనతో సమావేశమైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ముందు స్పష్టం చేశారు.

  ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడొచ్చిన సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని కేసీఆర్ అభిప్రాయపడినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఉండవల్లి మాటలను బట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెనుక కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.

  KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ

  Vundavalli on KCR: కేసీఆర్‌ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ

  ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో మిగిలాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపే రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే.. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గతంలో వచ్చిన కొద్దిపాటి సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్టు ఉండవల్లి మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోందనే దానిపై సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీతో ఉన్నట్టు అనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Congress, Rahul Gandhi, Telangana

  ఉత్తమ కథలు