హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం.. అదే రోజు కేసీఆర్ కీలక పర్యటన

Telangana: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం.. అదే రోజు కేసీఆర్ కీలక పర్యటన

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రేపు మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు గవర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్రసంగించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ కేబినెట్ ఈ నెల 5న స‌మావేశం కానుంది. ప్రగతి భవన్‌లో ఉద‌యం 10.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. 2023-24 బ‌డ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుప‌నుంది. మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్(CM KCR) మహారాష్ట్రలోని నాందెడ్(Nanded) పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు(Budget Session) రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రేపు మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు గవర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన త‌ర్వాత స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతున బీఏసీ సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌లో అనేక జనాకర్షక పథకాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పద్దులకు సంబంధించి సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు, ఎన్నికల హామీల అమలు అంశాలకు వార్షిక ప్రణాళికలో పెద్ద పీట వేయనున్నారు.

సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి లోబడి రుణమాఫీ పూర్తి చేయడం, తదితరాలకు నిధుల కేటాయింపు చేయనున్నట్టు తెలుస్తోంది. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, నీటి పారుదల ప్రాజెక్టులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పథకాలకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Revanth Reddy: మారిన రేవంత్ పాదయాత్ర వేదిక.. కొత్త వేదిక ఇదే..!

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు

ఎన్నికల ఏడాది కావడంతో పూర్తిగా ఆ దృష్టితోనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ అధికారుల కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ మరోమారు బడ్జెట్‌పై సమీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రతిపాదన ఖరారు చేయనున్నారు.

First published:

Tags: CM KCR, Telangana, Telangana cabinet

ఉత్తమ కథలు