తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. సీఎం కేసీఆర్(KCR) అధ్యక్షతన 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్(Telangana Cabinet Meeting) చర్చించే అవకాశం ఉంది. మరో ఏడాదిలోపు ఎన్నికలు ఉండటంతో.. టీఆర్ఎస్(TRS) సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. మరిన్ని వర్గాలకు చేరువయ్యే అంశాలపై కూడా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే సొంత ఇల్లు లేనివాళ్లు.. డబుల్ బెడ్ రూమ్(Double Bed Room) ఇళ్లు రాని వాళ్ల కోసం సొంత స్థలంలో ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు ఇస్తామన్న ప్రతిపాదనలను ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాలవారీగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ గత కొద్దిరోజుల క్రితం అన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని వెల్లడించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు మంత్రి కేటీఆర్. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని సూచించారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో దీనిపై సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దళితబంధు పథకాన్ని మరింత మంది లబ్దిదారులకు అందించేందుకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవచ్చని సమాచారం.
Big News: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..ఆ పాపం ఊరికే పోదంటూ తీవ్ర విమర్శలు
Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడంటూ..
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని ఏ విధంగా ఎండగట్టాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తానికి కేంద్రంతో తీవ్రంగా విభేదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ? ఏ విధంగా ముందుకు సాగుతుందన్నది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.