హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana :సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం..వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

Telangana :సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం..వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

కేసీఆర్​ (ఫైల్​)

కేసీఆర్​ (ఫైల్​)

Ts Cabinet decision: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెప్టెంబర్ 17వ తేదిని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet)కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్(KCR) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో సెప్టెంబర్ (September)  17వ తేదిని తెలంగాణ జాతీయ సమైక్యతా దినం(National Integration Day)గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈనెల 16వ తేది నుంచి 18వరకు మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈవేడుకలను ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్‌ భేటీలో నిర్ణయించారు.

Munugode: ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకోండి .. మందు పోసినా తాగండి .. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డిమూడ్రోజుల పాటు కార్యక్రమాలు..

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను 2022 సెప్టెబర్ 16,17,18 మూడురోజుల పాటు.... ముగింపు వేడుకలను... 2023 సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ..

వీటితో పాటు కేటినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16 వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించింది. సెప్టెంబర్ 17వ తేది నాడు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Telangana: తెలంగాణ విమోచన వేడుకలు.. మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖకళాకారులు,స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం..

సెప్టెంబర్ 17 మధ్యాహ్నం బంజారా, ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం, నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు చీఫ్‌ గెస్ట్‌గా సీఎం కేసీఆర్ అటెండ్ అవుతారు. అటుపై వజ్రోత్సవాలను ఉద్దేశించి ప్రసందిస్తారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు, కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలని మంత్రివర్గం తీర్మానింిచంది. తెలంగాణ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది.

పోడు భూముల సమస్యకు పరిష్కారం..

దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించి ఆమోదించింది క్యాబినెట్. గిరిజన,ఆదివాసీల పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని జిల్లాల వారిగా రెవిన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్‌ శాఖల ఆధ్వర్యంలో జిల్లా మంత్రి సమక్షంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని వీటికి సంబంధించి సీఎస్‌ చర్యలు చేప్టాలని మంత్రివర్గం సూచించింది.

నియోజకవర్గాల వారిగా దళిత బంధు..

ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా అందిస్తున్న దళితబంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గానికి విస్తరించాలని తీర్మానించింది. నియోజకవర్గానికి అదనంగా మరో 500మందికి ఈ పథకం వర్తింపు చేయనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో అర్హులైన లబ్ధి దారులను గుర్తించి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.

క్యాబినెట్‌లో ఆమోదించిన తీర్మానాలు ఇవే:

1.జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు..ఇతర కార్పోరేషన్లలో 5 నుండి 10 వరకు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది.

2.అలాగే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని కేబినెట్ తీర్మానించింది.

3. సుంకేశుల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచి ...అదనంగా 33 టిఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అందుకు గాను రూ. 2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.

4. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకై 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని కేబినెట్ తీర్మానించింది.

5. భధ్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

First published:

Tags: Telangana cabinet, Telangana Politics

ఉత్తమ కథలు